Hero Ram Charan At RTA Office In Khairatabad : సినీ నటుడు రామ్ చరణ్ ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త కారు TG 09 2727 రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి వచ్చారు. కారు రిజిస్ట్రేషన్ కోసం ఫొటో దిగి ఆ తర్వాత సంతకం చేశారు. అక్కడి అధికారులు చరణ్ కారు రిజిస్ట్రేషన్‌కు అవసరమైన సేవలను అందించారు. హీరో రామ్ రవాణాశాఖ కార్యాలయానికి వస్తున్న సంగతి తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి తన అభిమాన నటుడితో ఫొటో దిగడానికి ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ram Charan New Rolls Royce Car : అయితే రామ్ చరణ్ దగ్గర ఎన్నో లగ్జరీ కార్లు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన గ్యారేజ్‌లోకి మరో విలాసవంతమైన, ఖరీదైన కారు వచ్చి చేరింది. అదేంటంటే రోల్స్ రాయిస్. ఈ బ్రాండ్‌కు సంబంధించిన కార్లు చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవికి వైట్ కలర్ రోల్స్ రాయిస్ కారు ఉంది. ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ కూడా రోల్స్ రాయిస్ కారును కొన్నారు. దీని ధర దాదాపు రూ. 7.5 కోట్లు ఉంటుందని సమాచారం.
కాని కోట్లు వెచ్చించే సంపద ఉన్నా సరే రోల్స్ రాయిస్ సంస్థ అడిగిన వాళ్లందరికీ తమ కారును అమ్మదు. కారును బుక్ చేసుకున్న కస్టమర్ వ్యక్తిగత ప్రొఫైల్, సమాజంలో అతని స్థాయి, వివరాలు ఇలా అన్నింటినీ చూస్తుంది. ప్రస్తుతం ఈ రోల్స్ రాయిస్‌ను ఇండియాలో అతి తక్కువ మంది దగ్గర ఉంది. అందులో తాజాగా సినీనటుడు రామ్ చరణ్ కూడా చేరారు.