Raj Pakala Attend For Police Investigation in Janwada Farmhouse Party Case : జన్వాడ ఫామ్‌హౌస్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన న్యాయవాదితో పాటు విచారణకు వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇటీవల రాజ్ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని పోలీసులు అందులో పేర్కొన్నారు.
Narsingi ACP Ramana Goud Investigating Raj Pakala :జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్ కాలనీలో ఉన్న రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులతో ఈ మద్యం పార్టీ నిర్వహించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు రాజ్ పాకాల స్నేహితుడు విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు.
కేటీఆర్ బంధువు ఫామ్‌హౌస్‌లో కలకలం - డ్రగ్స్ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్