Rains in Andhra Pradesh : మండే ఎండలతో సతమతమైన ఏపీవాసులను గత కొద్దిరోజులుగా వరుణుడు పలకరిస్తున్నాడు. పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో మరో మూడురోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా మరో ముడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు మే 21 నుంచి ఏపీ వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
అకాల వర్షంతో అల్లాడుతున్న రైతులు - తడిసిన ధాన్యం - Effect of rain on grain crop
ఆ జిల్లాల్లో రేపు మోస్తరు వర్షాలు :మరోవైపు ద్రోణి ప్రభావంతో రేపు(శుక్రవారం) ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, మన్యం, అల్లూరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో ఓ మోస్తరు వర్షాలు కూరుసే అవకాశం ఉందనివాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా శనివారం ఎన్టీఆర్, సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
రైతులకు, కూలీలకు వాతావరణ శాఖ హెచ్చరిక : అలాగే ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వాతావరణ శాఖ సూచించింది. గురువారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రకాశం జిల్లా ఒంగోలులో 50.5మిమీ, నెల్లూరు జిల్లా ఓలేటివారిపాలెం 48.5మిమీ, నంద్యాల జిల్లా నందికొట్కూరులో 47.2మిమీ, నెల్లూరు లింగసముద్రం, గుడ్లూరులో 39.5మిమీ, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 27మిమీ, నెల్లూరు జిల్లా కలిగిరిలో 26.5మిమీ, ప్రకాశం మర్రిపూడిలో 24.5, అనకాపల్లి పాయకరావుపేటలో 23మి.మీ, నందికొట్కూరు (నంద్యాల)లో 4.7 సెం.మీ, నెల్లూరు జిల్లా లింగసముద్రం, గుడ్లూరులో 3.9 సెం.మీ వర్షపాతం చొప్పున వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో దంచికొడుతున్న వానలు : మరోవైపు తెలంగాణలోనిహైదరాబాద్లో మరోసారి వరుణుడు దండెత్తాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. నగరంలోని కూకట్‌పల్లిలో ముందుగా వర్షం మొదలైంది. అక్కడి నుంచి నిజాంపేట్, హైదర్‌నగర్, బాచుపల్లి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, మారేడుపల్లి, బేగంపేట్, ప్యారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జీడిమెట్ల, సూరారం, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు విస్తరించింది. అటు హిమాయత్ నగర్, సచివాలయం, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని మిగతా ప్రాంతాలకూ కూడా వర్షం విస్తరిస్తూ పోతుంది.
ముందుగానే నైరుతి రుతుపవనాలు - నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు - rains in andhra pradesh
హైదరాబాద్‌లో భారీ వర్షం - ఉప్పల్ మ్యాచ్‌పై అభిమానుల్లో టెన్షన్ టెన్షన్ - RAIN IN telangana