Overflowing Brooks and Meanders in AP : కృష్ణా జిల్లా కవీరులపాడు మండలం దొడ్డదేవరపాడు వద్ద వైరా - కట్టలేరుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వాగుపై ఉన్న దేవినేని వెంకట రమణ వారధిపై వరద నీరు ప్రవహిస్తుండడంతో రెవెన్యూ, పోలీస్ అధికారులు వాహన రాకపోకలు నిలిపివేశారు. వైరా - కట్టలేరు వాగుకు భారీగా పోటెత్తుతున్న వరదతో వీరులపాడు మండలంలోని వీరులపాడు, పల్లంపల్లి గ్రామాలలో పంట పొలాలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు : ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో రెండ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవన స్తంభించింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం,బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, మండలాల్లో పాలచర్ల వాగు, అశ్వరావుపేట వాగు, జల్లేరు వాగులతో పాటు, తూర్పు కాలువ, గుంజవరం వాగు, దొండపూడి వాగులు ఉప్పొంగుతున్నాయి. వీటివల్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కొవ్వాడ జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొంగువారి గూడెంలో కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాయం నుంచి నాలుగు గేట్లను ఎత్తి 6500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ విడుదల చేస్తున్నారు.
పలు ప్రాంతాల్లో వర్షం - లోతట్టు ప్రాంతాలు జలమయం - Rain in Andhra Pradesh 2024
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు : భారీ వర్షాలకు తమ్మిలేరులో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏలూరులోని శనివారపు పేట కాజ్ వే పై నుంచి వరద నీరు పోటెత్తింది. ఏలూరు నుంచి దుగ్గిరాల గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఏలూరు నగరంలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ తో నగరవాసులు అవస్థలు పడుతున్నారు.