ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రభుత్వంలో కస్టోడియల్‌ టార్చర్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘురామకృష్ణరాజు - Raghu Rama Krishnam Raju complaint

జగన్ ప్రభుత్వంలో తనను కస్టడీలో హింసించడంపై, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. పోలీస్ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్, సీతారామాంజనేయులు, వైఎస్ జగన్‌, విజయ్ పాల్‌పై ఫిర్యాదు చేశారు.

Raghu Rama Krishnam Raju
Raghu Rama Krishnam Raju (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 10, 2024, 9:06 PM IST

Raghu Rama Krishnam Raju complaint to SP: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తనపై జరిగిన కస్టోడియల్‌ టార్చర్‌పై మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘరామకృష్ణరాజు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్‌ కస్టడీలో తనపై హత్యాయత్నం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఘటనకు సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌, ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అప్పటి సీఐడీ అడిషనల్‌ ఎస్పీ విజయ్‌ పాల్‌ బాధ్యులని తెలిపారు. అలాగే, తన గాయాలపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డా.ప్రభావతి కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను విమర్శిస్తే చంపేస్తానని సునీల్‌ కుమార్‌ బెదిరించారని తెలిపారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

ఫిర్యాదులోని అంశాలు: 2021 మే 14వ తేదీన తాను హైదరాబాద్‌లోని తన నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబసభ్యులతో వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఏపీ సీఐడీ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడ్డారని రఘురామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అరెస్టు చేసిన తర్వాత గుంటూరులోని సీబీసీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారని తెలిపారు. తన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, వైద్య సహాయం, భోజనం సైతం ఏర్పాటు చేయలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తరువాత తనను రబ్బర్ బెల్ట్ మరియు లాఠీతో కొట్టడంతోపాటు శారీరక వేధింపులకు గురి చేశారని ఫిర్యాదులో రఘురామ వెల్లడించారు. అదే రోజు రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అప్పటి సీబీసీఐడీ., డీజీ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ సీతారామాంజనేయులుతో పాటుగా పోలీసు తనను చిత్రహింసలకు గురిచేసినట్లు రఘురామ తన ఫిర్యాదులో వెల్లడించారు.


జగన్ ఓడిపోయినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారు: లోకేశ్

గతంలో ప్రధానికి సైతం ఫిర్యాదు చేసిన రఘురామ: రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారంటూ... గతంలో ఏపీ సీఐడీ (AP CID) రఘురామను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు కస్టడీలో తనను హింసించినట్లు అప్పట్లో రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో ప్రధానికి రఘురామ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పట్లో వైఎస్సార్సీపీ విధానాలను ఆయన ప్రశ్నించడంతో ఆయనపై కక్షగట్టి కస్టోడియల్ టార్చర్ చేశారని ఆరోపించారు. స్వంత పార్టీపై విమర్ళల నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టారనే ఆరోపణలు సైతం వచ్చాయి.

ఐపీసీ సెక్షన్ల పవర్, లోకేశ్ రెడ్‌ బుక్‌ రియాల్టీ ఏంటో చూపిస్తాం: పట్టాభి - Pattabhi Ram on YSRCP Attacks

ABOUT THE AUTHOR

...view details