Raghu Rama Custodial Torture Case:ఒంగోలు ఎస్పీ కార్యాలయం వద్ద కామేపల్లి తులసిబాబు అతని అనుచరులతో కలిసి హల్‌చల్ చేశారు. మాజీ ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు విచారణకు హాజరయ్యారు. రఘురామపై దాడి చేసిన సమయంలో తులసిబాబు కూడా ఉన్నారని ఆరోపణ రావడంతో పోలీసులు అతనికి నోటీసులు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తులసిబాబు ఎస్పీ కార్యాలయానికి 27 కార్లతో ర్యాలీగా వచ్చారు. ఎస్పీ కార్యాలయంలోకి వెళ్లేందుకు తులసిబాబు అనుచరుల యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం నెలకొంది. అనంతరం తులసిబాబు కారు మాత్రమే లోపలికి అనుమతించారు. తులసి బాబును ఎస్పీ దామోదర్ విచారణ చేశారు.