Radisson Drugs Case Updates: మాదక ద్రవ్యాల కేసులో నిందితుడైన సినీ దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాడిసన్ హోటల్‌లో మాదక ద్రవ్యాలను వినియోగించారని గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసినందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ క్రిష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జస్టిస్ జి.రాధారాణి సోమవారం విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 41ఎ కింద పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలన్నారు. దీనికి అనుమతించిన హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.
Director Krish Withdrew Petition In High Court :తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ గత నెల 28వ తేదీన క్రిష్ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గచ్చిబౌలి పోలీసులు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు క్రిష్ రెండు రోజుల క్రితం పీఎస్‌కు వెళ్లారు. క్రిష్ శరీరంలో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు ఉన్నాయా లేవా అని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి పోలీసులు అతని మూత్ర నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. పోలీసుల విచారణ పూర్తైన తర్వాత క్రిష్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు.
గోవా జైలు కేంద్రంగా హైదరాబాద్‌లో మత్తు దందా - మొబైల్ నెట్వర్క్ ద్వారా డ్రగ్స్ సరఫరా
ర్యాడిసన్ హోటల్ మాదక ద్రవ్యాలకేసులో పోలీసుల ఎదుట మరొకరు హాజరయ్యారు. ఈ కేసులో 6వ నిందితుడుగా ఉన్న సందీప్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. అతడి నుంచి పోలీసులు మూత్ర నమూనాలు సేకరించారు. పరీక్షల్లో పాటిటివ్‌గా తేలితే సందీప్‌ను అరెస్టు చేసే అవకాశం ఉంది. మరో వైపు ఆదివారం మరో నిందితురాలు లిషి పోలీసుల ఎదుట విచారణకు హాజరైంది. నిందితులు నీల్, శ్వేత పరారీలో ఉన్నారు. శ్వేత కోసం టీఎస్ న్యాబ్ పోలీసులు గోవాలో గాలిస్తున్నారు.