Radisson Drugs Case Update : రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 24వ తేదీన పార్టీలో పాల్గొని డ్రగ్స్ ఎవరెవరు తీసుకున్నారు అనేది గుర్తించేందుకు క్రోమోటోగ్రఫీ పరీక్షలు (CHROMATOGRAPHY TESTS) నిర్వహించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందుకోసం కూకట్‌పల్లి కోర్టు అనుమతి కోసం ప్రయత్నించగా, కోర్టు అనుమతిని నిరాకరించింది. దీంతో త్వరలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
డ్రగ్స్ పార్టీలో 14 మంది పాల్గొన్నప్పటికీ కేవలం ముగ్గురికి మాత్రమే మూత్ర నమూనాల్లో పాజిటివ్‌గా తేలింది. విచారణకు హాజరైన వారిలో చాలా మంది డ్రగ్స్ పార్టీ (Drugs Party) జరిగిన 3 రోజులు, అంతకంటే ఎక్కువ రోజుల తర్వాతే విచారణకు హాజరయ్యారు. 72 గంటలు గడిచాక మూత్ర నమూనాల్లో డ్రగ్స్ ఆనవాళ్లు కనిపించే అవకాశం తక్కువ. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు క్రోమోటోగ్రఫీ పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా గోవాలో కొల్వాలే జైలులో ఉంటున్న ఫైజల్ డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసులు ఇటీవల గుర్తించారు.
డ్రగ్స్ కేసులో అత్యంత రహస్యంగా పోలీసుల ముందుకు దర్శకుడు క్రిష్ - రక్త, మూత్ర నమూనాల సేకరణ
అసలేం జరిగిందంటే : రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వ్యవహారంలో ఫిబ్రవరి 25న మంజీరా గ్రూపు డైరెక్టర్ వివేకానంద్, అతని స్నేహితులు నిర్భయ్, రఘు చరణ్, కేదార్, సందీప్, సినీ దర్శకుడు క్రిష్(Director Krish), నీల్, శ్వేత, లిషిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. అసలు వీరికి డ్రగ్స్ ఎలా లభిస్తున్నాయని కూపీ లాగగా, మంజీరా గ్రూపు సంస్థల మాజీ ఉద్యోగి సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీ వివేకానంద్‌కు అందిస్తున్నట్లు స్పష్టమైంది.
సయ్యద్ అబ్బాస్ అలీ జాఫ్రీని అరెస్టు చేసి విచారించగా, అత్తాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పని చేసే మీర్జా వహీద్ బేగ్ ద్వారా వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేసి విచారించగా ముషీరాబాద్‌కు చెందిన సయ్యద్ అబ్దుల్లా రెహ్మాన్ లింకు బయటపడింది. ఈ నిందితుడి ఆచూకీ కోసం మూడు వారాలుగా పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన గుట్టు విప్పితే గోవా, బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లో భారీ నెట్‌వర్క్‌ను నిందితులు నిర్వహిస్తున్నట్లు తేలింది. వీరితో పాటు సయ్యద్ అబ్బుల్ రెహ్మాన్, నరేంద్ర శివనాథ్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
రాడిసన్ డ్రగ్స్ కేసు లేటెస్ట్ అప్డేట్ - కీలక నిందితులు అరెస్ట్
మీర్జా వాహిద్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరు ప్రస్తావన