ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలి వానలో, వాగు నీటిలో పడవ ప్రయాణం- రహదారి తెలియదు పాపం! - Pudilanka peoples problem - PUDILANKA PEOPLES PROBLEM

PudiLanka People Facing Problems With Road Facility: రోడ్డు లేక దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలకు పడవ ప్రయాణమే దిక్కుగా నిలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి లేక ప్రమాదం అని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో బోటులో ప్రయాణాన్ని సాగిస్తున్నారు.

PudiLanka People Facing Problems With Road Facility
PudiLanka People Facing Problems With Road Facility (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 11, 2024, 8:32 AM IST

Updated : Aug 11, 2024, 10:18 AM IST

PudiLanka People Facing Problems With Road Facility: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామ ప్రజలకు రాకపోకలు సాగించేందుకు పడవే దిక్కు. తమకు రహదారి కావాలంటూ దశాబ్దాలుగా గ్రామస్థులు పాలకుల చుట్టూ తిరిగారు. గతంలో టీడీపీ హయాంలో కొంత మేర రహదారి నిర్మాణం చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రహదారి లేక ప్రమాదం అని తెలిసి కూడా తప్పని పరిస్థితుల్లో బోటులో ప్రయాణాన్ని సాగిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూడిలంక గ్రామానికి రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సముద్ర తీరానికి కిలో మీటర్ దూరంలో ఉండే ఈ లంక గ్రామం చుట్టూ ఉప్పుటేరు ఉంటుంది. ఈ గ్రామానికి చేరుకోవాలంటే పల్లె ఊరు అనే గ్రామం నుంచి కిలోమీటర్ బోటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు వ్యవసాయంతో పాటు ఉప్పు టేరులో దొరికే ఆల్చిప్పల ద్వారా ఉపాధి పొందుతుంటారు. ఉత్పత్తి చేసిన వాటిని అమ్ముకోవాలన్నా, నిత్యావసరాలు కొనుక్కోవాలన్నా బోటు ప్రయాణం చేయాల్సిందే.

నరకప్రాయంగా ఆముదాలవలస రహదారి - రోడ్డుపై గోతులు, దుమ్ము, ధూళితో ప్రయాణికుల అవస్థలు - Damaged Roads in Srikakulam

ప్రతి చిన్న వస్తువుకి రెండు బోట్ల సాయంతో వెళ్లి రావాల్సిందే. పడవల మీద ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోడ్డు లేకపోవడంతో ఇతర గ్రామ ప్రజలు ఇక్కడికి రావటానికి ఉండట్లేదు. తుపాన్​లు వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఎటూ వెళ్లలేని పరిస్థితి. రేషన్​ బియ్యం తెచ్చుకోవాలన్నా బోట్లలోనే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బోటు ఉంది కానీ గతంలో బోటు లేక నీళ్లలో దిగి ఈత కొట్టుకుంటూ వెళ్లవలసి వచ్చేది. ప్రజాప్రతినిధులు ఎవ్వరూ తమ పరిస్థితిని పట్టించుకోవట్లేదు. -పూడిలంక గ్రామస్థులు.

వర్షాకాలం, అత్యవసర పరిస్థితుల్లో నానా పాట్లు పడుతున్నారు. బోటు ప్రయాణం వల్ల ప్రమాదాలు కూడా జరిగాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. 2018లో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కోటి 30 లక్షల రూపాయలతో పూడిలంక గ్రామానికి రహదారి నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. 400 మీటర్ల మీద పనులు జరిగాయి. కానీ నిధులు సరిపోక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవేమి రోడ్లు బాబోయ్- ఏలూరు జిల్లాలో చుక్కలు చూపిస్తున్న రహదారులు - Damaged Roads in Eluru District

Last Updated : Aug 11, 2024, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details