Public Grievances of Janasena Leaders in Party Office: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఫిర్యాదులు సమర్పించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ బాధితులు ఆ పార్టీ నేతల అరాచకాలపై జనసేన నేతలకు ఫిర్యాదులు చేశారు.
'వైఎస్సార్సీపీ నాయకులు ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేశారు' - జనసేన నేతలకు బాధితుల ఫిర్యాదు - YSRCP Victims at Janasena Program
అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో కొలువైన శ్రీ సర్వ మంగళాంబ భోగలింగేశ్వర స్వామి, సీతారామ దేవాలయాలకు చెందిన 9 ఎకరాల భూమిని వైఎస్సార్సీపీ నేతలు ఆక్రమించి గత మూడేళ్లుగా లబ్ధి పొందుతున్నారని అర్చకులు ఫిర్యాదు చేశారు. రెండు ఆలయాల్లోని హుండీల కానుకలు సైతం దోచుకుంటున్నారని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. ఆలయ భూమిని వారి దగ్గర నుంచి విడిపించాలని కోరారు. తాడేపల్లిగూడేనికి చెందిన ఓ దివ్యాంగుడు తనకు వైకల్య ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు అందట్లేదని ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రామకృష్ణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తహసీల్దార్‌తో మాట్లాడి అవసరమైన ధృవ పత్రాలు వచ్చేలా ఏర్పాటు చేశారు.