ETV Bharat / state

భోగాపురం ఎయిర్‌పోర్టుకు మరో 500 ఎకరాలు - మంత్రుల కమిటీ ఏర్పాటు - BHOGAPURAM GREENFIELD AIRPORT

ఆర్థికమంత్రి పయ్యావుల నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు ఉత్తర్వులు - కమిటీలో సభ్యులుగా మంత్రులు బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్

Bhogapuram Greenfield Airport
Bhogapuram Greenfield Airport (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 10, 2025, 2:10 PM IST

Bhogapuram Greenfield Airport: భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్​పోర్టుకు అదనంగా 500 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనపై మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ నేతృత్వంలో పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనాశాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుకుని ఉన్న 500 ఎకరాల భూమిని అప్పగించాలంటూ జీవీఐఏఎల్ (GMR Visakhapatnam International Airport Limited) ప్రతిపాదన ఇచ్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం పక్కనే సిటీ సైడ్ డెవలప్​మెంట్​ కోసం ఈ భూమి అవసరం అని జీవీఐఏఎల్ పేర్కొంది. స్వర్ణాంధ్ర విజన్​లో భాగంగా ఉత్తరాంధ్రలో సామాజిక, ఆర్ధిక అభివృద్ధి అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా మంత్రుల కమిటీకి ప్రభుత్వం సూచించింది.

ఏవియేషన్ రంగంలో హైటెక్ ఉత్పత్తి, అనుబంధ సేవలు, ఏవియేషన్ హబ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలనూ అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ విశాఖ గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు భూ కేటాయింపు తర్వాత భూమి అభివృద్ధికి సంబంధించి ఆదాయం వచ్చేలా వివిధ అంశాలను పరిశీలించాలని జీఓఎంకు (Group of Ministers) సూచించారు.

వీలైనంత త్వరగా నివేదిక సమర్పించండి: వీలైనంత త్వరలో అధ్యయనానికి సంబంధించిన నివేదిక సమర్పించాలని మంత్రుల కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. కాగా భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు ((Bhogapuram International Airport)) అభివృద్ధికి 2203 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్రాంతంలో 2703 ఎకరాల భూమిని కేటాయించాలంటూ జీవీఐఏఎల్ ప్రతిపాదన సమర్పించింది. అదనపు 500 ఎకరాల భూ కేటాయింపునకు సంబంధించి అధ్యయనానికి మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు.

కాగా భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. తొలిదశలో భాగంగా ఎయిర్‌ స్పేస్, ఎడ్యుకేషన్‌ జోన్, ఎయిర్‌ సిటీ, ఇండస్ట్రియల్‌ జోన్, విడి భాగాల తయారీ పరిశ్రమలు, హెల్త్‌కేర్‌ జోన్, ఆరోగ్య, ఆతిథ్య రంగాల అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నారు. ప్రతి సంవత్సరం 6.8 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే లక్ష్యంగా ఎయిర్​పోర్టును తీర్చిదిద్దుతున్నారు. దీనిని అంచెలంచెలుగా 40 లక్షలకు పెంచున్నారు.

జెట్ స్పీడ్​లో భోగాపురం ఎయిర్​పోర్ట్ పనులు - డిసెంబర్ నాటికి టెర్మినల్‌ పూర్తి - Bhogapuram Airport Works

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.