ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాకు న్యాయం చేయండి - టీడీపీ కార్యాలయానికి 'క్యూ' కట్టిన వైఎస్సార్సీపీ బాధితులు - public grievance in TDP office - PUBLIC GRIEVANCE IN TDP OFFICE

Public Grievance held at TDP Central Office in Mangalagiri : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్​ను నిర్వహించారు. ఇందులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్​తో కలిసి రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను స్వీకరించారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నీంటిని సంబంధిత అధికారులకు పంపించి సత్వర పరిష్కారం చూపుతామని అర్జీదారులకు నాయకులు హామీ ఇచ్చారు.

Public Grievance held at TDP Central Office in Mangalagiri
Public Grievance held at TDP Central Office in Mangalagiri (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 24, 2024, 10:31 PM IST

Public Grievance held at TDP Central Office in Mangalagiri : తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ కార్యక్రమంలో నేడు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్​తో కలిసి రాష్ట్ర రెవిన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన అర్జీలను స్వీకరించారు. మంత్రి అనగాని మాట్లాడుతూ, గత వైఎస్సార్​సీపీ పాలనలో జరిగిన భూ అక్రమణలు, దౌర్జన్యాలకు సంబంధించిన వినతులే ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. వైఎస్సార్​సీపీ నాయకులు తమ భూములను అన్యాయంగా ఆక్రమించుకున్నారంటూ పేదలు, మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి వినతులు ఇస్తున్నారని వెల్లడించారు. తమ భూములను 22ఏ కింద చేర్చి అసైన్డ్ భూములు అంటున్నారని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నట్లు తెలిపారు.

అలాగే గ్రామ సహాయకుల సంఘం ప్రతినిధులు తమకు వస్తున్న డీఏను గత ప్రభుత్వం తొలగించిందని వాపోయారు. అంతేగాక చెల్లించిన మొత్తాలను కూడా రికవరీ చేసిందని, తమకు న్యాయం చేయాలని కోరినట్లు వివరించారు. విద్య, విద్యుత్, ఇతర శాఖలకు సంబంధించిన వినతులు పెద్ద ఎత్తున వచ్చినట్లు వెల్లడించారు. వచ్చిన అర్జీల్లో 90 శాతం వరకు భూములకు సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. బాధితుల నుంచి వచ్చిన వినతులన్నీంటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కారం చూపుతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అర్జీదారులకు హామీనిచ్చారు.

జగన్ హయాంలో నష్టపోయాం ఆదుకోండి - సీఎం చంద్రబాబుకు వినతులు - CM Chandrababu Receiving Requests

అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పునేందుకు తరలివచ్చారు. వైఎస్సార్​సీపీ నాయకుల అరాచకాలు, భూదోపీడీల మీద ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. వైఎస్సార్​సీపీ నేతలు గత ఐదేళ్లుగా ఎంతలా హింసించారో అర్ధం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని ఎద్దేవా చేశారు. అందుకూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత వస్తున్న ఫిర్యాదులే సాక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం పరిష్కరించగల ఫిర్యాదులను వాటి శాఖలకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు. అదేవిధంగా వైఎస్సార్​సీపీ ప్రభుత్వ బాధితుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని బీద రవిచంద్ర స్పష్టం చేశారు.

'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar

గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన "స్పందన"(Spandana) కార్యక్రమం పేరును కూటమి ప్రభుత్వం "పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌"(Public Grievance Redressal System)గా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించినప్పటి నుంచి అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాధితులకూ అండగా నిలుస్తుంది. ఇన్నేళ్లు వైఎస్సార్సీపీ నాయకులకు భయపడి నలిగిపోయిన ప్రజలు, కూటమి విజయంతో తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఉన్న కీలక నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

అధైర్యపడొద్దు, అండగా ఉంటా - 'ప్రజాదర్బార్‌'లో మంత్రి లోకేశ్​ భరోసా - Nara Lokesh Praja Darbar

ABOUT THE AUTHOR

...view details