Priyanka Chopra Visited Domakonda Temple In Kamareddy :కామారెడ్డి జిల్లాదోమకొండ మండల కేంద్రంలోని మహదేవుని ఆలయాన్ని నటి ప్రియాంక చోప్రా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గడికోటలోని మహాదేవుని ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆమె హైదరాబాద్ శివారులోని చిలుకూరి బాలజీ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ పూజలు చేశారు.
దోమకొండ గడిలో బాలీవుడ్ స్టార్ - మహాదేవునికి ప్రియాంక ప్రత్యేక పూజలు - PRIYANKA CHOPRA IN DOMAKONDA TEMPLE
దోమకొండలో మహాదేవుని ఆలయాన్ని సందర్శించి బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా - అనంతరం గడిలోని దేవున్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన నటి
Published : Jan 24, 2025, 5:22 PM IST
లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న ప్రియాంక గత కొన్ని రోజల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు నటుడిగా, దర్శకుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఎస్ఎస్ఎమ్బీ29లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా ఎంపికయ్యారంటూ ఇటీవల కథనాలు చక్కెర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌కు వచ్చారంటూ పలు చర్చలు కూడా జరిగాయి. ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆమె పలు ఆలయాలను సందర్శిస్తున్నారు.
చిలుకూరు ఆలయంలో ప్రియాంకా చోప్రా - భగవంతుడి దయ అనంతం అంటూ ఇన్‌స్టాలో పోస్ట్