Priest Kidnapped by Temple President in Chittoor District :తమిళనాడు పోలీసులమంటూ ఓ గుడి పూజారిని కిడ్నాప్ చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆపై సుమారు 12 రోజులపాటు చిత్రహింసలకు గురి చేసి నరకం చూపించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామంలో చోటుచేసుంకుంది. వివరాల్లోకి వెళ్తే, అగరమంగళం గ్రామానికి చెందిన రామచంద్రన్ స్థానికంగా ఉన్న అంకాల పరమేశ్వరి ఆలయంలో గతంలో పూజారిగా విధులు నిర్వహించేవాడు. అదేవిధంగా అక్కడికి వచ్చిన భక్తులకు అమ్మవారి ఆలయం వద్ద జ్యోతిష్యం చెప్పుకుంటూ జీవనం సాగించేవారు.
సోదరిని ప్రేమించాడని హత్యాయత్నం- కేసు వెనక్కి తీసుకోవాలని మంత్రి రజని భర్త ఒత్తిడి
అదే సమయంలో శ్రీరంగరాజపురుం మండలం కోటార్లపల్లి సమీపంలో ఉన్న స్మార్ట్ డీవీ చైర్మన్ అయిన దీపక్ కుమార్ పూజరి రామచంద్రన్ వద్దకు వచ్చారు. తనకు అమ్మవారి అనుగ్రహం లభించిందని తన ఆర్థిక పరిస్థితి ఇప్పుడు మెరుగుపడిందని పూజరితో చెప్పారు. తన జీవితం ఉన్నత స్థితికి చేరుకోవడానికి కారణమైన అమ్మవారికి తన వంతుగా సహాయం చేస్తానని చెప్పారు. అందులో భాగంగా ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ట్రస్టుని ఏర్టాటు చేసి తాను చైర్మన్‌గా ఉన్నారు. అలాగే పూజారి రామచంద్రన్‌ను సైతం ట్రస్టు సభ్యునిగా కొన్నాళ్లపాటు ఆలయ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించారు. అనంతరం కోట్లాది రూపాయలను వెచ్చించి ఆలయాన్ని పూనర్ నిర్మించినట్లు సమాచారం.
అనంతరం దీపక్ కుమార్ ఆలయ నిర్వహణ, పరిసర ప్రాంతాల భూములపై కన్నేశారు. దీంతో పూజారి రామచంద్రన్‌కు, దీపర్ కూమార్ మధ్య వివాదం చెలరేగింది. అప్పుటి నుంచి పూజారిపై దీపర్ కూమార్ ఉద్దేశ పూర్వకంగానే దాడులకు ప్రేరేపించేవారు. ఈ అవమానాలను భరించలేక రామచంద్రన్ పూజరి పదవిని వదులుకొన్నారు. అనంతరం పశువులను మేపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయిన తను చేసిన తప్పులు పూజారి ఎక్కడి బయటపెడతాడనే భయంతో దీపర్ కుమార్ పూజారిని కిడ్నాప్ చేసేందుకు పథకం రచించారు.