ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గన్నవరం చేరుకున్న రాష్ట్రపతి - గవర్నర్​, సీఎం ఘన స్వాగతం - PRESIDENT DROUPADI MURMU AP TOUR

గన్నవరం విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

President Droupadi Murmu AP Tour
President Droupadi Murmu AP Tour (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

President Droupadi Murmu AP Tour : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఏపీకి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయానంలో రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆమె పోలీసు గౌరవవందనం స్వీకరించారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి ఎయిమ్స్‌కు బయల్దేరి వెళ్లారు. మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ(ఎయిమ్స్‌) స్నాతకోత్సవంలో ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిగ్రీ పట్టాలను ప్రదానం చేయనున్నారు. ప్రత్యేకంగా నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలను అందించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళగిరి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కార్యక్రమం అనంతరం ద్రౌపదీ ముర్ము సాయంత్రం 4:15కు విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయల్దేరుతారని అధికార వర్గాలు ప్రకటించాయి.

గుంటూరు పానీపూరీ వాలాకు రాష్ట్రపతి నుంచి ఆహ్వానం- కారణం ఏమిటో తెలుసా? - President droupadi murmu Invitation

ABOUT THE AUTHOR

...view details