Children Health and Food Tips : పిల్లల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఆరోగ్యం, ఆహార అలవాట్లు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. చిన్నారులు ఆరోగ్యంగా, దృఢంగా ఎదగడానికి ప్రతిరోజూ తగినంత పోషకాహారం అవసరం అవుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇది ఎక్కువ అవసరం. ఎందుకంటే 6 నెలల వయస్సులో పెరుగుదల వేగంగా ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ శక్తి, పోషకాలు అవసరం అవుతాయి.
పప్పులన్నీ కలిపి పొడిలా చేసి: బియ్యం, పప్పుతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటుంది. దీంతో పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పప్పులు, ధాన్యాల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్ ఆరోగ్యకరంగా ఉండేలా ఉపయోగపడుతాయి. రోజూ కొద్దిగా వీటిని ఉడికించి పిల్లలకు ఉగ్గులా చేసి తినిపించాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే బాలామృతం, బాలామృతం ప్లస్‌ను చిన్నారులకు తప్పకుండా అందించాలి. అవగాహన లేక కొందరు తల్లిదండ్రులు వీటిని ఇవ్వట్లేదు.
అరటి పండ్లు,సేపు పండ్లు : పిల్లలకు రోజూ అరటిపండును తినిపించాలి. పిల్లల్లో మలబద్ధక సమస్యను తగ్గించడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ ఉంటాయి. సీజనల్‌గా లభించే పండ్లను తప్పనిసరి తినిపించాలి. రోజుకు ఒక తాజా పళ్లరసాలు పిల్లలకు తాగిపించడం వల్ల పోషకాహార లోపం అధిగమించడానికి వీలు కలుగుతుంది. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్ ఎదిగే పిల్లల మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయి. యాపిల్ పండ్లను ఉడికించి పెడితే పిల్లలకు కావాల్సిన పోషకాలు అందుతాయి.