Pratidhwani :స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని విలీనం చేయాలన్న ఆశలు ఆవిరయ్యాయి. లాభాల్లో ఉన్న మా కంపెనీలో నష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కును కలపటానికి వీల్లేదని సెయిల్ అంటోంది. ముందు నష్టాలు తగ్గించుకుని లాభాల బాట పట్టాకా అప్పుడు చూద్దామని ఆ సంస్థ చెబుతోంది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మనే చెప్పారు. తెలుగు ప్రజలకు విశాఖ ఉక్కుతో ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి.
ఆ కర్మాగారాన్ని కాపాడుకోవటం అందరి బాధ్యత. అయితే సెంటిమెంట్ ఉంటే సరిపోదు. సమస్యల సెటిల్మెంట్ కూడా జరగాలి. అదే ఎలా? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం 11వేల కోట్లతో ఇటీవలే ఒక ప్యాకేజి ప్రకటించింది. ఆ సాయానికి అందరూ సంతోషిస్తున్నారు. అయితే అది సరిపోతుందా? ఇంకా ఏం జరగాల్సి ఉంది? ముడిసరుకు మాటేంటి? ఇప్పటికే ఉన్న అప్పులు తీరేదెలా? మూతపడిన ప్లాంట్లు తెరిచేదెలా? ఇదే అంశాలపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) మాజీ స్వతంత్ర డైరెక్టర్కాశీ విశ్వనాథ రాజు, బీఎమ్ఎస్ స్టీల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కొమ్మినేని శ్రీనివాసరావు లు తమ అభిప్రాయాల్లో ఏం వెల్లడించారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవటం కోసం కేంద్రం 11 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు ఉన్న మొత్తం సమస్యలను దృష్టిలో పెట్టుకుంటే ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో 11వేలకోట్లు రావటం సంతోషకరమే. అయితే ఆ సంస్థని కష్టాల నుంచి గట్టెక్కించటానికి అది ఎంతవరకు దోహదపడుతోంది?
విశాఖ ఉక్కును సెయిల్‌లో విలీనం చేయాలన్న చిరకాల డిమాండ్లపై ఆ సంస్థ నీళ్లు చల్లింది. నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను మేము తీసుకోమని నిర్మోహమాటంగా సెయిల్ చెప్పేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మే చెప్పారు. దీనిపై సెయిల్ మాజీ డైరెక్టర్ ఎమంటున్నారు? అసలు వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏవేంటి? 11వేల కోట్ల ఆర్థికసాయం చేసిన తర్వాత కూడా ఇంకా ఏవేం సమస్యలు తీరాల్సి ఉంది?