తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజావాణికి పోటెత్తుతున్న జనం - భూ, ఆరోగ్య సమస్యలే అధికం - pravani program issues

Prajavani Programme in Telangana : కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ప్రజా భవన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కాగా ఈ కార్యక్రమంలో అధికంగా భూ సమస్యలు, ఉద్యోగ, ఆరోగ్యం వాటిపై పరిష్కారానికై వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Constable Recruitment Issue Raised in Prajavani
Prajavani Programme in Telangana

By ETV Bharat Telangana Team

Published : Feb 20, 2024, 2:47 PM IST

భూ ఆరోగ్య సమస్యలే అధికం -ప్రజావాణికి పోటెత్తుతున్న జనం

Prajavani Programme in Telangana: రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రారంభించిన తొలి కార్యక్రమం ప్రజావాణికి ప్రజలు పోటెత్తుతున్నారు. మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ, ఆరోగ్యం, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి సంబంధించిన వినతులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఇవాళ జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన ప్రజలు తమ ఊళ్లో అక్రమ ల్యాండ్​ రిజిస్ట్రేషన్​ అరికట్టాలని కోరారు. 2003 నుంచి 2011 వరకు గ్రామంలో ఉన్న భూమి కంటే ఎక్కువ ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేశారని, వాటిలో తమ ప్లాట్లను కూడా యాడ్ చేశారని వాపోయారు. అలా ఎక్కువ ల్యాండ్ ఉన్నట్లు రిజిస్టర్ చేసిన వాటిని తొలగించాలని ప్రజావాణిలో విజ్ఞప్తి చేశారు. అలాగే తమ ప్లాట్లను ధరణిలో చేర్చాలని విన్నవించారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కింద తన భూమి ఉందని గత ప్రభుత్వం తన భూమిని ఆక్రమించుకుందని దానికి నష్టపరిహారం చెల్లించాలని ఒక వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

భూ సమస్యలే అధికం : ఉప్పల్​లోని లావని పట్టా భూములు అక్రమంగా విక్రయాలు చేస్తున్నారని మల్లాపూర్ వాసి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. పట్టాల పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేస్తున్నారని వారిపై ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని రవీందర్​ అనే వ్యక్తి ప్రజావాణి కార్యక్రమంలో విన్నవించారు.

ప్రజావాణికి పోటెత్తిన దరఖాస్తులు - కాంగ్రెస్​ సర్కారైనా తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతులు

Constable Recruitment Issue in Prajavani :మరోవైపు 2022లో కానిస్టేబుల్​ నోటిఫికేషన్​లో ఎంపికైన టీఎస్​ఎస్పీ అభ్యర్థులు, సివిల్​ మిగతా వారితో కలిపి తమకు కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు విన్నవించారు. ఇప్పటికే రెండు సంవత్సరాల సమయం వృథా అయిందని వెంటనే శిక్షణ ఇస్తే తమకు సర్వీస్ ఉంటుందని అన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఖాళీ ఉన్న పోలీస్​ ఉద్యోగాలకు నోటిఫికేషన్​ విడుదల చేసి వెంటనే రిక్రూట్​మెంట్​ చేపట్టాలని పోలీస్​ అభ్యర్థులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

"మాకు నోటిఫికేషన్ ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది. ఎంపికైన అందరికి శిక్షణ ఇస్తున్నారు. ఒక్క టీఎస్​ఎస్పీ వాళ్లకి ఆక్యుపెన్సి లేదని ఇవ్వడం లేదు. మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పటికే రెండు సంవత్సరాల సమయం వృథా అయింది. మాకు ట్రైనింగ్ ఉంటే రెండెళ్లు సర్వీస్ ఉండేది. అధికారులు మాకు ఎక్కడో ఒకచోట ఏర్పాటు చేసి వారితో పాటే శిక్షణ ఇవ్వాలి." - కానిస్టేబుల్​ అభ్యర్థులు

ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న జలగం గంగాధర్ అనే వ్యక్తి ఆరోగ్య సమస్యలతో కూర్చికే పరిమితమయ్యాడు. తనకు 21 సంవత్సరాల సర్వీసు ఉందని, తన ఉద్యోగం ఆయన కుమారుడుకి ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దీనిపై అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజావాణిలో ఈ సమస్యపై రెండోసారి ఫిర్యాదు చేయాడానికి వచ్చినట్లు చెప్పారు. తన ఉద్యోగం తన కుమారుడికి ఇప్పించని పక్షంలో తనుకు ఆత్మహత్యే శరణ్యమని వాపోయారు.

ప్రజావాణి కార్యక్రమంలో వృద్ధురాలితో కలెక్టర్​ ముచ్చట

ప్రజావాణికి అనూహ్య స్పందన - ప్రజాభవన్ వద్ద చలిలోనే క్యూ కట్టిన ప్రజలు

ABOUT THE AUTHOR

...view details