Prajavani Program Issues In Karimnagar :ప్రభుత్వ కార్యాలయానికి ఏదైనా సమస్య పరిష్కారం కోసం వెళ్లిన వారిని అడిగితే సహజంగా ఏమంటారు. సమయం పడుతుందంటా, చాలా ప్రక్రియ ఉందంట లేదా నాలాంటి సమస్యలాగే మస్తుమందికి ఉందటా పరిష్కృతం అవుతుంది కానీ సమయం పడుతుంది అంటారు. ప్రజల సమస్యలపై కొందరు అధికారులు సీరియస్‌గా పని చేస్తే మరికొందరు కాలక్షేపం చేస్తుంటారు. పట్టించుకోరు. అచ్చం అలాంటి సంఘటనే కరీంనగర్ ప్రజావాణి కార్యక్రమంలో చోటుచేసుకుంది. ప్రజలు సమస్యలు విన్నవించుకోవడానికి వస్తే కొందరు అధికారులు ఫోన్స్‌లో మునిగిపోయారు. రీల్స్, వాట్సాప్ స్టేటస్, షాపింగ్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
ప్రతి సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఇంటర్నెట్‌లో ఒకరు రీల్స్ చూస్తుంటే, మరొకరు వాట్సాప్ స్టేటస్‌లు చూస్తు కాలక్షేపం చేస్తున్నారు. మరికొంతమంది అధికారులు మత్రం ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో దరఖాస్తులు కుప్పలుతిప్పలుగా పడి ఉంటున్నాయి. తాజాగా ఇద్దరు బాధితులు తమ సమస్యలు పరిష్కృతం కావడం లేదని అక్కడే ఆత్మహత్యాయత్నం చేశారు.
Suicide Attempt in Prajavani Program in Karimnagar :కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మాజీ సర్పంచ్ జగన్మోహన్ గౌడ్ మన ఊరి మనబడి పనులు చేశారు. దానికి రూ.60లక్షల ఖర్చు అయిందని వాటి బిల్లులు రావాలని ప్రజావాణి కార్యక్రమానికి వచ్చాడు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ తనతో పాటు తెచ్చుకున్న దస్తితో ఉరి వేసుకోవడానికి ప్రయత్నించాడు. అక్కడ ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతికి వినతి పత్రం ఇచ్చి బిల్లు ఇప్పించాలని కోరారు. బిల్లుల రాకపోతే తమ కుటుంబం రోడ్డున పడతుందని ఆవేదన వ్యక్తం చేశారు.