Kalki 2898 AD Movie Old Temple : రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్, మైథలాజికల్ కల్కి 2898 ఏడీ మూవీ థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అదరగొట్టారు. సినిమాలో, తొలుత రిలీజ్ చేసిన ట్రైలర్లో ఎక్కువగా ఓ పురాతన ఆలయాన్ని చూపించారు. ఆ ఆలయంలోనే ఎన్నో ఏళ్ల పాటు అమితాబ్ బచ్చన్ ఉన్నట్లు చూపించారు.
మూడో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా 'కల్కి' ఫస్ట్ డే కలెక్షన్స్ - ఎన్ని కోట్లంటే?
ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శిస్తుండటంతో చిత్రం చూపించిన దేవాలయం ఎక్కడ ఉందో అని ప్రభాస్ అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు. దీంతో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అభిమానుల కోసం ఈటీవీ భారత్ టీమ్ దీని గురించి తెలుసుకుంది. ఈటీవీ భారత్ చేసిన పరిశీలనలో ఈ పురాతమైన ఈశ్వరుని ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు తెలిసింది. నెల్లూరి జిల్లా పెరుమాళ్లపాడులోని నాగేశ్వర ఆలయమే అది అనే ప్రచారం జరుగుతోంది.
చారిత్రక నేపథ్యం.. నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో ఇసుకలో ఈ నాగేశ్వర స్వామి ఆలయం నిక్షిప్తమై ఉంది. 2020లో చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామం వద్ద ఇసుక తవ్వకాలు జరుపుతున్న సమయంలో ఈ చారిత్రాత్మక నాగేశ్వర స్వామి ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా ఇసుకలో నిక్షిప్తమై ఉన్నట్లు సమాచారం. అంతేకాదు జానపద కథల ప్రకారం ఈ ఆలయాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతున్నారు.