ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు అండగా టాలీవుడ్​ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

Donations To Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ క్రమంలోనే బాధితులకు విరాళాలు ఇచ్చేందుకు టాలీవుడ్ కదిలింది. సినీ నటులు ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, తమ వంతుగా విరాళాలను ప్రకటించారు. అలాగే అక్కినేని కుటుంబం, సినీ నటుడు అలీ తమ వంతు సాయం ప్రకటించారు.

Prabhas and Allu Arjun Donation To Telugu States
Prabhas and Allu Arjun Donation To Telugu States (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2024, 1:12 PM IST

Updated : Sep 4, 2024, 4:52 PM IST

Prabhas and Allu Arjun Donation To Telugu States :తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు, స్వచ్చంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. వారికి అండగా నిలబడేందుకు టాలీవుడ్ కదిలింది. తాజాగా వరద బాధితుల సహాయార్థం ప్రభాస్‌ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.కోటి చొప్పున రెండు కోట్లు విరాళం ఇచ్చారు.

అల్లు అర్జున్ కోటి రూపాయలు విరాళం : అదే విధంగా అల్లు అర్జున్ తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. ట్విటర్(X) వేదికగా స్పందిస్తూ ఏపీ, తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్నిచూసి తాను బాధపడ్డానని అన్నారు. ఈ సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా తాను రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌లకు మొత్తం కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నానని ప్రకటించారు. అందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను :వీరితో పారటు నేను సైతం రామ్ చరణ్ ముందుకు వచ్చి తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయనిధికి రూ.50 లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ట్విటర్(X) వేదికగా స్పందిస్తూ "వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు (Rs.1 Crore) విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను." అని తెలిపారు.

వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం-మానవత్వం చాటుకుంటున్న దాతలు - Chiranjeevi Donate One Crore

తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున అక్కినేని కుటుంబం విరాళం ప్రకటించింది. వరద బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు. అలాగే వరద బాధితులకు తెలుగు సినీ నటులు అలీ తన వంతు సాయం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు రూ.3 లక్షల చొప్పున అలీ విరాళం ప్రకటించారు.

పవర్​స్టార్​​ గొప్ప మనసు - వరద బాధితులకు రూ.6 కోట్లు విరాళం - Pawan Dontation to Flood Victims

Last Updated : Sep 4, 2024, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details