తెలంగాణ

telangana

ETV Bharat / state

సోషల్​ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారా? - జాగ్రత్త "SMASH" చూస్తోంది! - SOCIAL MEDIA ACTION SQUAD HYDERABAD

వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సోషల్​ మీడియాలో రెచ్చిపోయే వారికి చెక్​! - సోషల్​ మీడియా యాక్షన్​ స్క్వాడ్​ హైదరాబాద్​ విభాగం నిఘా - సుమోటోగా కేసులు నమోదు చేస్తున్న పోలీసులు

DEROGATORY POSTS ON SOCIAL MEDIA
SOCIAL MEDIA ACTION SQUAD HYDERABAD (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2024, 3:30 PM IST

Social Media Action Squad : సోషల్​ మీడియాలో అభ్యంతరకర పోస్టులు, విద్వేషపూరిత, వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. శాంతి భద్రతలతో పాటు సాధారణ ప్రజాజీవనం పైనా సామాజిక మాధ్యమాల పోస్టులు తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కఠిన చర్యలకు దిగుతున్నారు. కేసులు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపిస్తున్నారు.

కేవలం ఫిర్యాదులతోనే కాకుండా ‘సైబర్‌ ప్యాట్రోలింగ్‌’ ద్వారా సోషల్​ మీడియాలోని పోస్టులపై నిఘా ఉంచి బాధ్యులపై సుమోటోగా కేసులు పెడుతున్నారు. వివాదాస్పద కామెంట్లు చేసి పోలీసులకు చిక్కుతున్న కేసుల్లో ఎక్కువగా విద్యార్థులు, సాధారణ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఉంటున్నారు. కేసులు నమోదయ్యాక బాధ్యుల్ని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేసినప్పుడు పొరపాటున, క్షణికావేశంలో చేశామంటూ చెబుతున్నారు.

స్మాష్​కి చిక్కితే జైలుకే : సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసి వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఘటనలు రాష్ట్ర రాజధానిలోనే ఎక్కువగా నమోదవుతున్నట్లు జాతీయ నేర గణాంక సంస్థ- 2022 వెల్లడించింది. దేశంలోని 19 మెట్రోనగరాల్లో హైదరాబాద్‌ తొలిస్థానంలో నిలిచిందంటే సోషల్​ మీడియా ప్రభావం అర్థం చేసుకోవచ్చు. 2022లో 94 కేసులు నమోదుకాగా ఈ ఏడాది 20 నమోదు చేసినట్లు తెలిసింది.

'బీఆర్ఎస్​ కార్యకర్తలే మంత్రి సురేఖపై ట్రోలింగ్​ చేశారు - సంస్కారహీనంగా ఆ పార్టీ సోషల్​ మీడియా పోస్టులు' - raghunandan rao on Minister Trolls

నగరంలో తరచూ సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు, వీడియోలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. కొన్నిసార్లు వర్గాల మధ్య వివాదాలకు దారి తీస్తుండడంతో హైదరాబాద్‌ పోలీసులు ప్రత్యేకంగా స్మాష్‌ (సోషల్‌ మీడియా యాక్షన్‌ స్క్వాడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌) విభాగాన్ని ప్రారంభించారు. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్​ పోలీసుల ఐటీ విభాగాలతో ప్రత్యేకంగా సైబర్‌ ప్యాట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వివాదస్పద పోస్టులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు.

ఎవరూ పట్టించుకోరని :ఓ పార్టీ నాయకుడు నచ్చలేదన్న కారణంతో అతడి కుటుంబాన్ని, వ్యక్తిత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేస్తూ దాడి దిగుతున్నారు. ప్రపంచంలో ఏదో ఒక మూల జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని ఓ వర్గాన్ని కించపరుస్తూ విద్వేషపూరిత పోస్టులు పెడుతుండటం ఇటీవల సర్వ సాధారణమైంది. వాట్సాప్‌ గ్రూపులు, ఎక్స్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్​లలో అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని కొందుర్గు మండలానికి చెందిన ఓ తాపీ మేస్త్రీ వాట్సాప్‌ గ్రూపులో ప్రముఖ రాజకీయ నాయకుడి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ పోస్టు పెట్టాడు.

దీనిపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అతనిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో వచ్చిన ఓ పోస్టు చూసి ఆవేశంలో ఓ వర్గాన్ని కించపర్చే కామెంట్స్ చేశాడు. సైబర్‌ పెట్రోలింగ్‌ ద్వారా ఈ కామెంట్‌ను గుర్తించిన పోలీసులు యువకుడి మీద వెంటనే కేసు నమోదు చేశారు. ముందు పోస్టులు, వీడియోలు పెట్టి తర్వాత తొలగించినా ఇప్పుడున్న టెక్నాలజీతో పట్టుబడతారు. అందుకే ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

'మీ సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంది - పోస్టులు పెట్టకండి, లైక్ చేయకండి!'

చెల్లెలి ఫోటోతో ఫేస్​బుక్​ డీపీ - మాయమాటలతో తెలంగాణవాసికి రూ.1.23 కోట్లు టోపీ

ABOUT THE AUTHOR

...view details