Ponguleti Srinivasa Reddy in Khammam : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని సందర్శించారు. ముజ్జుగూడెంలో వెటర్నరీ ఆసుపత్రి భవన నిర్మాణానికి, నేలకొండపల్లిలో గ్రంధాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. నేలకొండపల్లిలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కళాశాల ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాధించుకున్నతెలంగాణకు పదేళ్ల పాలనలో గత ప్రభుత్వం ఏమీ చేయలేదని, మీ గ్రామానికి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అన్ని పనులు చేస్తానని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే - కుటుంబసమేతంగా సీఎంతో భేటీ
Ponguleti Srinivasa Reddy : ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత 48 గంటల లోపే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షలు ఇచ్చామని అన్నారు. అలాగే రూ. 500లకే గ్యాస్ బండ ఇస్తుందని, గ్రామ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తుందని తెలిపారు.
ఖమ్మంలో పొంగులేటి పర్యటన :ఈ ప్రజపాలనలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చిన పథకాలు అమలు చేస్తామని తెలిపారు. రేపు 11వ తేదీన భద్రాద్రి రాముడు సన్నిధిలో ఇళ్ల స్థలం ఉన్న వారికి రూ. 5లక్షలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) సమక్షంలో ఇస్తారని స్పష్టం చేశారు. పాలేరు నియోజక వర్గంలో మార్పు కావాలని మీరు తనను గెలిపించారని, మళ్లీ కొద్ది రోజుల్లోనే ఎంపీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన అన్నారు.