Police Special Drive on Pending Cases in Telangana :కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ కేసులకు చట్టబద్ధమైన ముగింపు చెప్పడానికి పోలీసు శాఖ సన్నద్ధమవుతోంది. దీంతో పాటు వివాదాస్పదంగా ఉన్న కేసులపైనా దృష్టి సారించి మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలనే యోజన చేస్తోంది. రాష్ట్రంలో సంవత్సరానికి సగటున లక్షన్నర కేసులు నమోదవుతుంటాయి. అంతకు ముందు పరిష్కారం కాని కేసులు వీటికి తోడవుతుంటాయి. గత సంవత్సరం కూడా దాదాపు లక్షన్నర కేసులు నమోదు కాగా 2022 వరకు పరిష్కారం కాని 45,511 కేసులో వీటిలో కలిశాయి. అంటే మొత్తం కేసుల్లో నాలుగో వంతు పాత ఫిర్యాదులే ఉంటున్నాయి.
25 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుల్లో అనేక మందిని సీఐడీ అధికారులు ఇప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేశారు. 2008లో ఓ చీటింగ్ కేసు నమోదు చేని దానిని పక్కన పెట్టారు. ఇలా ఎందుకు జరిగిందని ఆ కేసు గురించి ఇప్పుడు ఆరా తీస్తున్నారు. పోలీసు శాఖలో ఒక్కసారి కేసు పెండింగ్లో పడితే ఇక అది అలానే కొనసాగుతూనే ఉంటుంది. బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన విసిగి పోవాలే తప్పా ఆ కేసు ముందుకు పోతది అనుకుంటే ప్రయోజం ఉండదు.
కరీంనగర్‌లో జోరుగా భూ కబ్జాలు - అక్రమార్కులకు కళ్లెం వేస్తున్న పోలీసులు
2000లో జరిగిన కొన్ని నేరాల దర్యాప్తు ఇప్పటికి పూర్తి కాలేదు. కానీ చట్టం ప్రకారం ఒక్కసాపరి నమోదైన తర్వాత దాన్ని పక్కా పరిష్కరించాల్సిందే. ఆధారాలు దొరకని పక్షంలో అదే విషయాన్ని న్యాయస్థానానికి తెలిపి అర్థవంతమైన ముగింపు పలకాలి. కానీ చాలామంది అధికారులు వాటిని పరిష్కరించకుండా, చట్టబద్ధంగా ముగింపు పలకకుండకా అలాగే వదిలేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పెండింగ్ కేసుల మధ్య సగటున సంవత్సరానికి కనీసం50వేల వరకు ఉంటోంది. ఒక్క హైదరాబాద్లోనే నగరంలో వేలల్లే పేరుకుపోయాయని ఇటీవల జరిగిన సమీక్ష సమావేశాల్లో వెల్లడైంది.