ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద భద్రత పెంపు - TDP Central Office - TDP CENTRAL OFFICE

Police Security Increased at TDP Central Office: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా పోలీసుల్లో మార్పు వచ్చింది. దాదాపు అన్నీ సర్వేలు కూటమికే పట్టం కట్టడంతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు పరిసరాలను పరిశీలించారు.

tdp_central_office
tdp_central_office (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 2, 2024, 4:06 PM IST

Police Security Increased at TDP Central Office:ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఒక్కసారిగా పోలీసుల్లో మార్పు వచ్చింది. దాదాపు అన్నీ సర్వేలు కూటమికే పట్టం కట్టడంతో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద పోలీసులు భద్రత పెంచారు. పార్టీ కార్యాలయం వద్దకు వచ్చిన పోలీసు ఉన్నతాధికారులు పరిసరాలను పరిశీలించారు. తెలుగుదేశం తరఫున ఎలాంటి అదనపు భద్రతా కోరకుండానే బలగాల పెంపుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యాలయంపై దాడి సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా పట్టించుకోని వైనాన్ని గుర్తుచేసుకుంటున్న నేతలు ఇప్పడు భద్రత పెంచడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద పార్కింగ్ ఏర్పాట్లకు అదనపు సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద భద్రత పెంపు (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details