Rangareddy Double Murder Case :రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ జంట హత్యల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద దారుణహత్యకు గురైన యువతి, యువకుడి వివరాలను పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : యువకుడు మధ్యప్రదేశ్‌కి చెందిన అంకిత్ సాకేత్‌గా గుర్తించారు. సాకేత్ హౌస్ కీపింగ్ పనిచేస్తూ నానక్‌రామ్‌గూడలో నివాసం ఉంటున్నాడు. యువతి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు(25)గా గుర్తించారు. ఆమె ఎల్బీ నగర్‌లో నివాసం ఉంటోంది. ఈనెల 3న బిందు అదృశ్యమైనట్లు వనస్థలిపురంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బిందుకి ముగ్గురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.