Police Arrested Eight For Selling Adulterated Ginger Garlic Paste :ఈ మధ్యకాలంలో ఇన్స్టంట్ ఫుడ్‌పై ప్రజలు విపరీతంగా ఆధార పడుతున్నారు. ఉద్యోగాల్లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ఇన్స్టంట్ పిండిల నుంచి ప్రతీదీ చిటికెలో అయిపోవాలి అని చూస్తున్నారు. ఈ క్రమంలో వారు వాడుతుంది మంచిదా? లేదా అన్న విషయం పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు బయట కొంటారు. దాన్ని తయారు చేయడం సమయంతో కూడిన పని కావడంతో బయట కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి చిన్న విషయాలనే ఆసరాగా చేసుకుని రెచ్చిపోతున్నారు 'నకిలీ'గాళ్లు. ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా, లాభాలపై ఆశతో కల్తీ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. తాజాగా టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఏకంగా 1500 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను పట్టుకున్నారు.
సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్‌పల్లిలో కల్తీ అల్లంపేస్ట్ తయారీ కేంద్రంలో టాస్క్‌ఫోర్స్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 1500 కిలోల కల్తీ అల్లంపేస్ట్ స్వాధీనం చేసుకుని 8 మందిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ వై.వి.ఎస్.సుధీంద్ర ఆదివారం తెలిపారు. రాజరాజేశ్వరి నగర్లో మహ్మద్ షఖీల్ అహ్మద్ ‘సోనీ జింజర్ గార్లిక్ పేస్ట్ పేరిట వ్యాపారం నిర్వహిస్తున్నారు. కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అమీర్‌పేట్ స్వీట్ షాప్స్‌లో కొనేముందు జాగ్రత్త! - ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఏం తేలిందంటే