Police Arrest Gang Involved in Circulating Fake Currency Notes In Srikakulam District : శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. సంత లక్ష్మీపురంలో దొంగ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ మూర్తి తెలిపారు. వీరి నుంచి 57 లక్షల 25 వేల రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సరిహద్దు ప్రాంతం పట్టుపురం వద్ద నకిలీ కరెన్సీ నోట్లు మార్పు చేస్తుండగా పోలీసులు పట్టుకుని ఆరా తీయడంతో నకలీ కరెన్సీ చాలామణి చేస్తున్నట్లు బయటపడింది. శుక్రవారం మెలియాపుట్టిలో టెక్కలి డీఎస్పీ మూర్తి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెలియాపుట్టి మండలం సంత లక్ష్మీపురం గ్రామంలో ఒక ముఠా దొంగ నోట్లు ముద్రిస్తుంది. కరజాడ గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ ఎంపీటీసీ దాసరి రవి కూడా వీరికి సహకారాలు అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దొంగ నోట్ల ముఠా అరెస్ట్- రూ.10లక్షలకు రూ.44 లక్షల నకిలీ కరెన్సీ - Fake Currency Gang Arrest