తెలంగాణ

telangana

ETV Bharat / state

డ్రగ్స్‌కు అలవాటు పడి విక్రేతలుగా మారిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు - AMEERPET EXISE POLICE IN HYDERABAD

డ్రగ్స్‌కు బానిసై తర్వాత డ్రగ్స్‌ వ్యాపారం చేస్తున్న సాప్ట్​వేర్ ఉద్యోగులు - బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్న నిందితులు - నలుగురుని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించిన పోలీసులు

AMEERPET EXISE POLICE
DRUG CASE IN HYDERABAD (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 11, 2024, 8:00 PM IST

Police Remand Four Accused :బెంగుళూరు నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న నలుగురు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను అమీర్​పేట్​ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. వారి వద్ద నుంచి 6.65 గ్రాముల ఎండీ ఎమ్ఏ డ్రగ్స్, 2.27 గ్రాముల గంజాయి, 8.57 గ్రాముల హ్యష్ ఆయిల్​తో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ ఇన్స్​పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం కేరళకు చెందిన సంజయ్, శ్రీజిత్, ఆదర్శ్ అనే వ్యక్తులు ఎస్​ఆర్ నగర్​లోని కార్ఫ్ 1 గ్లోబల్ సొల్యూషన్ అనే సాఫ్ట్​వేర్​ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరంతా కలిసి ఆఫీస్​కు సమీపంలోనే ఓ బాయ్స్​ హాస్టల్లో నివాసం ఉంటున్నారు.

వీరితో హైదరాబాద్​లోని న్యూబోయిన్​పల్లికి చెందిన అజయ్​ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరంతా డ్రగ్స్​కు బానిసలు అయ్యారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు డ్రగ్స్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని ప్రకారమే హైదరాబాద్​లో డ్రగ్స్​ను విక్రయించాలని పక్కా పథకం వేశారు. బెంగళూరు నుంచి శ్రీజిత్, ఆదర్శ్, సంజయ్ డ్రగ్స్​ను నగరంలోకి గుట్టుచప్పుడు కాకుండా తీసుకువస్తున్నారు.

నిందితులను అరెస్టు చేసిన అబ్కారీ పోలీసులు (ETV Bharat)

గుట్టుచప్పుడు కాకుండా నగరంలోకి : బోయిన్​పల్లికి చెందిన అజయ్ దానిని అమ్మి పెడుతున్నాడు. విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం (డిసెంబర్​ 11న) నిందితులను ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ దాడుల్లో సబ్​ ఇన్స్​పెక్టర్​లు రాధ, బాలరాజు, బిక్షారెడ్డి పాల్గొన్నారు.

ఉక్కుపాదం దిశగా : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స రహిత రాష్ట్రంగా మార్చే ప్రక్రియకు బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే డ్రగ్స్, గంజాయి కోనుగోలు, అమ్మకాలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదంతో అణచి వేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్​ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సినీ తారలను ఈ మధ్యే డ్రగ్స్​పై అవగాహన కొరకు ఓ షార్ట్​ ఫిల్మ్​ తీసి ప్రభుత్వం చేసే కార్యక్రమంలో భాగం కావాలని కోరారు. దీనిపై స్పందించిన మెగాస్టార్​ చిరంజీవి, అల్లు అర్జున్​ డ్రగ్స్​ వల్ల కలిగే అనర్థాలపై వేరు వేరు వీడియోలను తీసి విడుదల చేశారు.

అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య
మత్తు పదార్థాలకు కేరాఫ్​గా మారుతోన్న పబ్బులు - దారికి తెచ్చేందుకు పోలీసుల వరుస దాడులు - TG NAB POLICE RAIDS IN PUBS

ABOUT THE AUTHOR

...view details