Temple Robbery in Komarolu : దొంగతనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఏ వస్తువు అయితే నాకేంటి నాపనేదో నేను చేసేస్తే పోలా అనుకుంటున్నారు. ఇక ఇళ్లు, దేవాలయాలు, కార్యాలయాలకు తాళం కనిపించిదంటే చాలు చేతికి పని దొరికిందని సంబరపడుతున్నారు. వాటిని లూఠీ చేసే వరకు మనశ్శాంతి లభించదనుకుంటూ చోరీలకు పాల్పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం కొందరు దొంగలు అమ్మవారి గుడిని ఎంచుకున్నారు. ఎవరూ లేని సమయం చూసి ఎంచక్కా ఆలయంలోకి ప్రవేశించారు. అమ్మవారి నగలు, హుండీలోని నగదును తీసుకున్నారు. ఇక పనైపోయిందని ఎవరికి చిక్కమని అనుకున్నారు. కానీ ఇక్కడే వారికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
Poleramma Temple Robbery in Gonepalli : ఆ దొంగలు చోరీ చేస్తున్న విషయాన్ని గమనించిన స్థానికులు వారిని పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తమను కొట్టి పోలీసులకు అప్పగించడాన్ని వారు అవమానంగా భావించారు. మరి పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలని అనుకున్నారేమో! మళ్లీ ఆ గుడిలోనే దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సారి ప్లాన్ సక్సెస్ అయింది. ఇక మన్నల్ని ఎవ్వరూ పట్టుకోలేరులే అని అనుకున్నారు. అయితే గ్రామస్తులు చోరీ జరిగినా విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వీరి గుట్టు బయటపడింది. దొంగలను పట్టుకుని విచారించిన పోలీసులు వారి చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.