Case filed Against CI for Sexual Assault On Minor Girl : ఒంటరిగా ఉన్న మైనర్ బాలికతో ఓ పోలీస్ అధికారి అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని ఓ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్ అదే ప్రాంతంలో ఉంటున్న ఓ బాలికపై కన్నేసి అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు.
కాపాడాల్సిన వాడే కాటేయబోయాడు - మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం - POCSO CASE FILED ON CI
మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన, అత్యాచారయత్నం - సీఐపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు
![కాపాడాల్సిన వాడే కాటేయబోయాడు - మైనర్ బాలికపై సీఐ అత్యాచారయత్నం EtvCase filed Against CI for Sexual assault With Girl](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-10-2024/1200-675-22748620-thumbnail-16x9-pocso.jpg)
Published : Oct 24, 2024, 8:20 AM IST
ఇది గమనించిన బాలిక తప్పించుకుని తల్లికి విషయం చెప్పగా ఆమె ఫిర్యాదు మేరకు కాజీపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కాగా ఓ బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న పోలీసు అధికారే బాలికపై అసభ్యంగా ప్రవర్తించడం స్థానికంగా కలకలం రేపింది. ప్రజలను రక్షించాల్సిన సీఐ ఇలా చేయడం చర్చకు దారితీసింది.
విధి నిర్వహణలో అలసత్వం :గతంలో హనుమకొండ, మామ్ నూర్, మడికొండ ఠాణాల్లో ఇన్స్పెక్టర్గా పనిచేసిన రవికుమార్‌ను ఉన్నతాధికారులు రెండు వారాల క్రితం మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయానికి సరెండర్ చేశారు. మడికొండలో విధుల నిర్వహణలో అలసత్వంపై రవికుమార్‌పై వేటు వేసి హెడ్ క్వార్టర్‌కు అటాచ్ చేశారు.