Man Having Affair With Daughter in AP :తల్లితో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తెతో ప్రేమాయణం నడిపాడు ఓ ప్రబుద్ధుడు. అంతే కాదు తల్లికి చెప్పకుండా స్కూల్ నుంచి ఆ మైనర్ బాలికను తనతో తీసుకెళ్లాడు. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ మహిళ ఆందోళన చెందింది. రాత్రి వరకు చుట్టుపక్కల వెతికి చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చేపట్టగా ఆ ఇద్దరూ హైదరాబాద్లో దొరికారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంత కాలంగా తన భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెకు పదో తరగతి చదువుతున్న కుమార్తె ఉంది. కుమార్తెతో కలిసి ఆమె వేరుగా జీవిస్తోంది. అలా ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆ తల్లీకూతుళ్ల జీవితంలో టంగుటూరు మండలం పొందూరుకు చెందిన ఇండ్లా రాజు అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు.
మాయమాటలు చెప్పి ప్రేమాయణం :ఇండ్లా రాజు అనే వ్యక్తితో ఈ తల్లీకూతుళ్లకు పరిచయం ఏర్పడింది. అలా ఆ మహిళతో రాజు సహజీవనం చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే అతడు ఆమె కుమార్తెపైనా కన్నేశాడు. రోజు ఆమెను స్కూలుకు తీసుకెళ్లి తీసుకు వస్తుండేవాడు. అలా తల్లితో సహజీవనం చేస్తూ తండ్రి స్థానంలో ఉన్న రాజు తన నైతికతను మరిచాడు. ఆ మైనర్ బాలికకు మాయమాటలు చెబుతూ ప్రేమలో దింపాడు.