PM Modi Stop Pawan Kalyan Speech in Praja Galam Meeting At Chilakaluripeta : చరిత్రలో నిలిచేలా చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. పల్నాడు జిల్లా చిలకూరిపేటలోని బొప్పుడి వేదికగా ప్రజాగళం బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్లొన్నారు. ఈ కార్యక్రమానికి మూడు పార్టీల నేతలు భారీ సంఖ్యలో కదిలి వచ్చారు. పది సంవత్సరాల తరువాత ముగ్గురు నేతలు ఒకే వేదికపైకి రావడంతో, ఎన్టీఏ సభకు ప్రజలు భారీస్థాయిలో పాల్గొని విజయవంతం చేశారు. మూడు పార్టీల కార్యకర్తలు, అభిమానులతో సభ కిక్కిరిసిపోయిది.
అభివృద్ధి చెందిన ఏపీ కావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి: ప్రధాని మోదీ
ప్రజాగళం బహిరంగ సభలో భాగం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. అధికార పార్టీ ఈ ఐదు సంవత్సరాలల్లో చేసిన వైఫల్యాలను సూటిగా ప్రశ్నిస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ప్రసంగం సాగుతుండగా ఆసక్తికరణ సంఘటన చోటు చేసుకుంది. సభకు హాజరైన అభిమానులు, కార్యకర్తలు బారికేడ్ల పైకి, లైటింగ్ టవర్లపైకి ఎక్కారు. ఈ ఘటనను ప్రధాని మోదీ గమనించారు. వెంటనే తన కూర్చున్న స్థానం నుంచి లేచి పనన్ అంటూ ప్రసంగాన్ని ఆపారు. అంతే అక్కడ ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
జనసేనాని మాట్లాడుతున్న పోడియం వద్దకు వచ్చి బారికేడ్ల పైకి, లైటింగ్ టవర్లపైకి ఎక్కిన వారిని కిందకు దిగాలని సూచించారు. దయచేసి బారికేడ్లు దిగాల్సిందిగా యువకులను కోరారు. విద్యుత్ తీగలవల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది, అర్థం చేసుకోవాలని బతిమాలారు. పోలీసులు వెంటనే వారిని కిందకు దించాలని, ఏం చేస్తున్నారంటూ వారిని ప్రశ్నించారు. ఖాకీలు తీరుపై కొద్దిపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని వంటి పెద్దవారు చెబుతున్నారు అర్థం చేసుకోవాలని పవన్ కూడా చెప్పారు. చంద్రబాబు సైతం లేచి చేతి సంజ్ఞలతో దిగాలని సూచించారు. దీంతో అభిమానులు విద్యుత్ టవర్లు దిగారు. మోదీ చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.