ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోత లేకుండా, నొప్పి తెలియకుండా - కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్

కిడ్నీలో రాళ్లకు ఆధునిక విధానంలో పరిష్కారం - పిన్నమనేని కళాశాలలో ఆరోగ్యశ్రీ లేకున్న వైద్యసేవలు

Kidney Stone Problem At Pinnamaneni Siddhartha Medical College
Kidney Stone Problem At Pinnamaneni Siddhartha Medical College (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 2, 2024, 8:57 AM IST

Updated : Nov 2, 2024, 9:52 AM IST

Kidney Stone Problem At Pinnamaneni Siddhartha Medical College : కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెట్టేందుకు పిన్నమనేని సిద్థార్థ వైద్య కళాశాల సరికొత్త ఆవిష్కరణలు చేసింది. ఆధునిక వైద్య విధానంలో పేదలకు ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తూ రికార్డు నెలకొల్పింది. ఒక ఏడాది వ్యవధిలోనే లేజర్‌ విధానంలో ‘రెట్రోగేడ్‌ ఇంట్రారీనల్‌ సర్జరీ’లను వందకు పైగా విజయవంతంగా పూర్తి చేశారు. ఇదే విధానంలో చేసే శస్త్రచికిత్సలకు ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. అంత ఖర్చుతో కూడుకున్న వాటిని ఉచితంగా ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద పేదలకు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేనివాళ్లకు కూడా చాలా తక్కువ ధరకే ఈ వైద్యం అందుబాటులో ఉంచారు.

విజయవంతంగా ఏడాదిలో వంద శస్త్రచికిత్సలు : కృష్ణా జిల్లా గన్నవరం శివారు చినఆవుటపల్లిలో ఉన్న పిన్నమనేని సిద్థార్థ వైద్య కళాశాల గతంలో యూరాలజీ విభాగం ఆధ్వర్యంలో కిడ్నీలో రాళ్లకు కోత విధానంలో శస్త్రచికిత్సలు చేసేవాళ్లు. అనంతరం 20 ఏళ్లుగా లాప్రోప్కోపిక్‌ పద్ధతిలో చేశారు. సంవత్సరం కిందట రూ.50 లక్షలకు పైగా ఖర్చుపెట్టి యూరాలజీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలు కొనుగోలు చేశారు. అప్పటినుంచి అందరికీ లేజర్‌ విధానంలోనే శస్త్రచికిత్సలు చేయటం మొదలు పెట్టారు. ఏడాదిలో వంద శస్త్రచికిత్సలు చేస్తే అన్నీ విజయవంతమయ్యాయి.

పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట - kidney disease in Uddanam area

మూత్ర విసర్జన మార్గం గుండా స్కోప్‌ పైపు :గతంలో కోత విధానంలో చేసే శస్త్రచికిత్సల సమయంలో కనీసం నెల రోజులకు పైగా ఆసుపత్రిలోనే రోగి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చేది. అలాగే లాప్రోస్కోపిక్‌ ద్వారా కీహోల్‌ విధానంలో చేసే శస్త్రచికిత్సలకూ కనీసం వారం, పది రోజులు విశ్రాంతి అవసరం. కానీ ప్రస్తుతం లేజర్‌ పద్ధతి రావడంతో రోగి కేవలం రెండు రోజుల్లో ఇంటికి వెళ్లిపోతున్నారు. మూత్ర విసర్జన మార్గం నుంచి ఫ్లెక్సిబుల్‌ స్కోప్‌ పైపును పంపించి లేజర్‌ ద్వారా కిడ్నీలోని రాళ్లను కరిగిస్తారు. పిండిగా మారిపోయిన రాళ్ల పొడి మూత్రంలో కలిసి బయటకు వస్తుంది. పిన్నమనేనిలో ఇప్పటి వరకూ 2MM నుంచి 20MM వరకూ ఉన్న రాళ్లను కరిగించారు.

రాళ్లను కరిగించే శస్త్రచికిత్సలు : మూత్ర మార్గంలో పంపించే పైప్‌ కిడ్నీలో ఉండే 11 గదుల్లోని రాళ్లను గుర్తించి బయట ఏర్పాటు చేసిన తెరపై చూపిస్తుంది. ఆ తెరపై చూస్తూ వైద్యులు రెట్రోగేడ్‌ ఇంట్రారీనల్‌ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేయగలుగుతున్నారు. గతంలో కొన్ని సార్లు రాళ్లను కరిగించే శస్త్రచికిత్సలు విఫలమయ్యేవి. ప్రస్తుతం ఆ పరిస్థితే లేదని వైద్యులు వెల్లడించారు. కళాశాలలో నిర్వహించిన సమావేశంలో పిన్నమనేని విద్యాసంస్థల డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ డాక్టర్‌ భీమేశ్వరరావు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అనిల్, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సూర్యకుమారి, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బాలమురళీకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పవన్‌ సాయి తదితరులు పాల్గొన్నారు.

మిస్టరీగా కిడ్నీవ్యాధి కారణాలు- ఆదుకోవాలని వేడుకుంటున్న గ్రామస్థులు - kidney disease in NTR district

ఆధునిక విధానంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతోనే యూరాలజీ విభాగంలో శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు సమకూర్చాం. రూ.50లక్షల వరకూ ఖర్చు చేసి లేజర్‌ విధానంలో శస్త్రచికిత్సలు ప్రారంభించాం. ప్రస్తుతం కిడ్నీలో రాళ్ల సమస్యకు అధునాతన విధానంలో వైద్యులు పరిష్కారం చూపిస్తున్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. - డాక్టర్‌ చదలవాడ నాగేశ్వరరావు, పిన్నమనేని విద్యాసంస్థల డైరెక్టర్‌ జనరల్‌

ప్రస్తుతం ఆధునిక విధానంలో రోగికి ఎటువంటి నొప్పి, ఇబ్బంది లేకుండా, రక్తస్రావం తగ్గించి, శరీరంపై ఎలాంటి కోత లేకుండా శస్త్రచికిత్స జరుగుతుంది. రెండు, మూడు రోజుల్లోనే రోగులు సంతోషంగా ఇళ్లకు వెళ్లవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ గత ఏడాదిలో 100 మందికి ఈ విధంనంలోనే విజయవంతంగా పూర్తి చేయగలిగాం. - డాక్టర్‌ బాలమురళీకృష్ణ, యూరాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌

మీ ఇంటి ముందు, మీ చేనులో అంతటా పెరుగుతుంది - లివర్, కిడ్నీ నుంచి కీళ్ల నొప్పుల దాకా దివ్యఔషధం! - Galijeru Leaves Health Benefits

Last Updated : Nov 2, 2024, 9:52 AM IST

ABOUT THE AUTHOR

...view details