ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురంలో తిష్ట వేసిన సమస్యలు - కేంద్రంగా ఏర్పడి రెండేళ్లయినా తప్పని ఇబ్బందులు - Peoples problems in Parvathipuram - PEOPLES PROBLEMS IN PARVATHIPURAM

People Suffering from Problems in Parvathipuram: పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా మారాక అభివృద్ధి పరుగులు పెడుతుందని పుర ప్రజలు ఆశపడ్డారు. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయని సంబరపడ్డారు. ప్రగతి మాట దేవుడెరుగు సమస్యలు పరిష్కృతం కాకపోగా జటిలమయ్యాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న తాగునీరు, డంపింగ్ యార్డు, డ్రైనేజీ వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. రాబోయే ప్రభుత్వమైనా సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తుందన్న గంపెడాశతో ప్రజలు ఉన్నారు.

peoples_problems_in_parvathipuram
peoples_problems_in_parvathipuram (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 15, 2024, 8:58 PM IST

People Suffering from Problems in Parvathipuram:గతంలో విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పార్వతీపురం అదే మన్యం జిల్లాకు కేంద్రంగా మారి రెండేళ్లు పూర్తయింది. 15 మండలాలు, ఒక నగర పంచాయతీ, రెండు పురపాలక సంఘాలతో పార్వతీపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంగా ఏర్పడ్డాక పార్వతీపురాన్ని గణనీయంగా అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశించారు. కానీ డివిజన్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులే ఇప్పటికీ పూర్తికాలేదు.

పార్వతీపురం జిల్లా కేంద్రం కాకముందు వేసవిలోనే తాగునీటి ఎద్దడి ఎదురయ్యేది. ప్రస్తుతం ఈ సమస్య నిత్యకృత్యమైంది. పురప్రజలకు సరిపడా నీరు అందజేయడంలో యంత్రాంగం విఫలమైంది. రెండేళ్ల క్రితం తాగునీటి పథకం కోసం శిలాఫలకం చేసి ప్రారంభించిన పనులు ముందుకు సాగలేదు. ఫలితంగా జిల్లాలోనూ ఏడాదంతా తాగునీటికి కటకట ఏర్పడింది.

తిరుమలలో చిరుత కలకలం - భక్తుల కారు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు - Cheetah spotted at Tirumala

పార్వతీపురానికి డంపింగ్ యార్డు పెను సమస్యగా మారింది. రోజుకు 25 టన్నుల మేర చెత్తను రాయగడ రోడ్డు పక్కన పడేస్తున్నారు. యార్డును తరలించాలన్న ఏళ్లనాటి డిమాండ్‌ అరణ్యరోదనగానే మిగిలింది. సమీప నివాసులు, వాహనదారులను దుర్వాసన వేధిస్తోంది. వర్షకాలంలో సమస్య మరింత తీవ్రమవుతోంది. పార్వతీపురం జిల్లా కేంద్రంగా మారాక వాహనాల రాకపోకలు గణనీయంగా పెరిగినా రహదారుల విస్తరణ కాదుకదా పాడుబడ్డ రోడ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. ట్రాఫిక్‌ సమస్యలు అధికమయ్యాయి. సిగ్నల్‌ వ్యవస్థ పూర్తిగా పాడయింది. పార్కింగ్‌ సమస్య జటిలమైంది. పట్టణ డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారింది. శివారుల్లో కొత్త కాలనీలు వెలసినా కాలువలు నిర్మించలేదు. వర్షాలు పడితే గణేశ్‌నగర్‌ సహా ప్రధాన రహదారిలోని వీధులు ముంపునకు గురవుతున్నాయి. మురుగు రోడ్డెక్కుతోంది.

ఓటమి భయం వైఎస్సార్సీపీ నేతలను నరరూప రాక్షసులుగా మార్చేసింది- దాడులపై మండిపడ్డ లోకేశ్, టీడీపీ నేతలు - TDP Condemn YSRCP Leaders Attack

అసలే పార్వతీపురం ఆస్పత్రికి రోగుల తాకిడి ఎక్కువ. 100 పడకల ఆస్పత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ సాధారణంగా అంతకు మించి భారీ సంఖ్యలో ఓపీ నమోదయ్యేది. జిల్లా కేంద్రంగా మారాక ప్రభుత్వం 150 పడకలకు అప్‌గ్రేడ్‌ చేసినా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. కొత్తగా చేపట్టిన మల్లీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. పార్వతీపురంలో ప్రజలు సేదతీరేందుకు గతంలో 6 పార్కులు ఏర్పాటు చేసినా ఒక్కటీ వినియోగంలో లేదు. ఎక్కడా సరైన పార్కు రూపుదిద్దుకోలేదు. ఎస్​ఎస్​ఎం నగర్‌లో ఏర్పాటు చేసేందుకు పదేళ్ల క్రితమే పనులు ప్రారంభించినా వైసీపీ హయాంలో పక్కనపెట్టారు. పిల్లలు ఆడుకునేందుకు ఓ దాత పరికరాలు సమకూర్చినా ఏర్పాటు చేయలేదు.

ప్రాణం మీదకు తెచ్చిన విందు- వృద్ధుడి గొంతులో మటన్ ముక్క- చాకచక్యంగా తొలగించిన వైద్యులు - Bone Stuck in Old Person Throat

ABOUT THE AUTHOR

...view details