People Suffering From Drinking Water in Gudivada:కృష్ణా జిల్లా గుడివాడలో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడుతున్నారు. నీళ్లివ్వండి మహో ప్రభో అంటూ స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటున్నా ఫలితమే లేదంటూ చేష్టలుడిగి పోతున్నారు. తమ గోడు పట్టించుకునేవారే లేరని స్థానికులు వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల ఆలసత్వం కారణంగా గుడివాడ పట్టణ వాసులను దాహం కేకలు వెంటడుతున్నాయి.
గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో పెద ఎరుకపాడులో 63 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు, 105 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మరొక మంచినీటి చెరువును నిర్మించారు. చెరువుల నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. 63 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత చెరువుకు మూడు సంవత్సరాల క్రితం గండి పడితే ఇంత వరకు దాన్ని పూడ్చలేదు. నిర్వహణ లేకపోవడంతో కొత్త చెరువు కట్ట కూడా బలహీనంగా మారింది. దీంతో ఈ చెరువులో నీటిని నింపితే ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 2 చెరువులు ఆధ్వాన స్థితికి చేరడంతో అధికారులు వాటిల్లో నీటిని నింపకుండా వదిలేశారు. దీంతో చెరువుల్లో నీరు మట్టం తగ్గిపోయింది.
నీళ్లు పచ్చగా వస్తున్నాయి. పది నిమిషాలు మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. వేసవి కాలంలో నీరు లేకుండా ఎలా బ్రతకాలి. అన్నీ ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం నీళ్లు మాత్రం ఎందుకు ఇవ్వట్లేదు? ప్రభుత్వ విధానాలు ఏం చేస్తున్నాయి. ప్రభుత్వ విధానం బాగోలేనప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వస్తున్నారు. మంచి నీటి చెరువు కట్టతెగిపోయింది. మూడు సంవత్సరాల నుంచి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. దాని కారణంగా గుడివాడ మొత్తం నీరు కోసం ఇబ్బంది పడుతోంది. -మోనాలిక, స్థానికురాలు
నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur