ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాంతించిన గోదారమ్మ - అయినా ముంపులోనే లంకగ్రామాలు, వేలాది ఎకరాలు - Godavari Floods in Dhavaleswaram - GODAVARI FLOODS IN DHAVALESWARAM

Godavari Floods in Lanka Villages : గోదావరిలో వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసహరించారు. అయినా మరోవైపు కోనసీమలోని లంక గ్రామాలు వరద గుప్పిట్లోనే మగ్గుతున్నాయి. ఇళ్లలోకి వరద చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంటలు పూర్తిగా మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Godavari Floods in Dhavaleswaram
Godavari Floods in Dhavaleswaram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 10:04 AM IST

Godavari Floods in Dhavaleswaram Barrage2024 :ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి వరద ప్రవాహం తగ్గుతోంది. దీంతో రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద గోదావరి శాంతించింది. ఈ క్రమంలోనే అధికారులు ఆనకట్ట వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసహరించారు. ప్రస్తుతం నీటిమట్టం 13.70 అడుగులకు చేరడంతో, సముద్రంలోకి 12.70 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Godavari Floods in AP 2024 :మరోవైపు గోదావరి వరదతో కోనసీమ పరిధిలోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్యాన పంటలు, కాజ్‌వేలు మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు సక్రమంగా తాగునీరు సరఫరా చేయట్లేదని, వరద నీటిలోనే వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నట్లు బాధితులు వాపోయారు.

Godavari Water Level at Bhadrachalam : పొలాలు ముంపు బారిన పడటంతో పంటలు నీటిలో నానుతున్నాయి. ఉద్యాన పంటలకు అపార నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో 3,500 ఎకరాల విస్తీర్ణంలోని పంటలు దెబ్బతిన్నాయని, ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. ఉదయం 8 గంటలకు 47.1 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. అయితే మంగళవారం నుంచి బుధవారం వరకు నీటిమట్టం తగ్గింది.

గోదావరికి పెరుగుతున్న వరద ఉద్ధృతి - ముంపులోనే గ్రామాలు, వేలాది ఎకరాలు - Flood Effect in Andhra Pradesh

ఉగ్రరూపం దాల్చిన గోదావరి - రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ABOUT THE AUTHOR

...view details