Veg Burji Recipe in Telugu : ఇంట్లో కూరగాయలు లేవనగానే వెంటనే మన దృష్టంగా కోడిగుడ్లపైకి వెళ్తుంది. కుటుంబాల్లోనే కాదు బ్యాచిలర్స్ ఎక్కువగా చేసుకొనే వంటకం కోడిగుడ్లే. ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కారం, ఉప్పుతో సింపుల్గా గుడ్డు ఫ్రై చేసుకుని ఆ పూటకు కానిచ్చేస్తారు. ఎగ్ వంటకాల్లో ఎగ్ బుర్జీ ఎక్కువ ఫేమస్.
ఉదయం టిఫిన్లలోకి, మధ్యాహ్నం లంచ్కి పిల్లల బాక్సుల్లోకి ఈజీగా రెడీ చేసుకుని సులభంగా సర్దేయొచ్చు. పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేకుండా అతి తక్కువ సమయంలోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ బాగా వంట తెలిసిన వాళ్లే చేయాలని లేదు. ప్రొటీన్, శక్తిని అధికంగా అందించే ఎగ్ బుర్జీ ఎవరైనా చేసేయొచ్చు.
అయితే, ఇంట్లో ఎగ్స్ కూడా లేనపుడు దాదాపు అదే స్థాయిలో రుచి కోసం బుర్జీ తయారీ ఎలా చేయాలో తెలుసుకుందామా! వెజిటేరీయన్లు కూడా ఎగ్ లెస్ ఎగ్ బుర్జీతో ప్రొటీన్లను సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఎగ్ లెస్ బుర్జీ తయారు చేద్దాం పదండి!
గుంటూరు ఘాటుతో గోంగూర మటన్ - చూస్తేనే నోరూరిపోయేలా!
ఎగ్‌లెస్ బుర్జీ తయారీకి కావలసిన పదార్థాలు
- శెనగపిండి - 1 కప్పు
- అవిసె గింజల పొడి - ఒక స్పూన్
- తాజా పెరుగు - 5 స్పూన్లు
- ఉప్పు - రుచికి తగినంత
- నీరు - ముప్పావు కప్పు
- మీడియం సైజ్ ఉల్లిపాయలు 2- తరుగు
- అర క్యాప్సికం - తరుగు
- సగం క్యారెట్ - తరుగు
- సగం టమోటా - తరుగు
- పచ్చిమిర్చి - రెండు చీలికలు
- కారం - రెండు చెంచాలు
- పసుపు - ఒక చెంచా
- కొత్తిమీర - తరుగు
ఎగ్‌లెస్ బుర్జీ తయారీ విధానం:
- ఎగ్‌లెస్ బుర్జీ తయారీ కోసం ముందుగా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
- శెనగపిండి, అవిసె గింజల పొడిని కలుపుకొని అందులో పెరుగు, నీళ్లు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దోశల పిండి మాదిరిగా వచ్చే వరకూ బాగా కలపాలి.
- ఒక పాన్ వేడిచేసి కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అందులోనే టమాట తరుగు కూడా వేసి మెత్తబడే వరకు వేగనివ్వాలి. వాటికి క్యాప్సికం, క్యారెట్, పచ్చిమిర్చి తరుగు వేసి అన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి.
- కూరగాయలను వేయిస్తున్న సమయంలోనే పసుపు, జీలకర్ర పొడి, మసాలా దినుసులతో పాటు కారం వేసుకుని బాగా కలుపుకోవాలి.
- కూరగాయల ఫ్రై సిద్ధమయ్యాకు ముందుగా సిద్ధం చేసుకున్న శనగపిండి మిశ్రమాన్ని పొర మాదిరిగా కప్పుతూ పాన్‌పై పరచాలి.
- ఒక వైపు ఉడికిన తర్వాత, మరో వైపు తిరగేసి మళ్లీ ఉడికించాలి. బుర్జీలా కనిపించేలా గోధుమ రంగులోకి మారే వరకు ఉడికించాలి. పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీద నుంచి దించుకోవాలి. అంతే ఎగ్ లెస్ బుర్జీ రెడీ అయినట్లే!
కేరళ స్టైల్లో కోడిగుడ్డు కర్రీ - కొబ్బరి పాల గ్రేవీతో సూపర్ టేస్ట్
పులుసు ఇలా పెట్టి చూడండి - చేపలంటే నచ్చని వాళ్లు కూడా ఇష్టంగా తింటారు!