ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద ధాటికి సొంతూళ్లకు పయనం - బస్సుల్లేక బస్టాండ్‌లో బాధితుల తిప్పలు - PEOPLE FACE TO TRANSPORT PROBLEM - PEOPLE FACE TO TRANSPORT PROBLEM

People Suffer Due to Transport System Blocked in Vijayawada : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్​, ఆర్టీసీ బస్​ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైళ్లు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు

Transport System Blocked in Vijayawada
Transport System Blocked in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 8:55 AM IST

People Suffer Due to Transport System Blocked in Vijayawada :బస్సుల్లేవు. రైళ్లు రావు, ప్రైవేటు వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఊరెళ్లే దారులన్నీ మూతబడ్డాయి. ఓ వైపు వరద కష్టాలు, మరోవైపు ఆకలి తిప్పలు. ఇదీ విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌లో ఉన్న వరద బాధిత ప్రయాణికుల దుస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద బీభత్సం సృష్టించడంతో సొంతూరుకు వెళ్దామని కట్టుబట్టలతో చాలామంది బస్టాండ్‌కి వచ్చేశారు. తీరాచూస్తే బస్సుల్లేక బస్టాండ్‌లోనే తలదాచుకోవాల్సి వచ్చింది. ఒకవైపు దోమల బాధ, మరోవైపు ఎముకలు కొరికే చలితో నరకయాతన అనుభవిస్తున్నారు.

బస్టాండ్‌లో ప్రయాణికుల పడిగాపులు :బస్సెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదురుచూపులు చూస్తున్నారు. వీళ్లలో తెలంగాణకి చెందిన వారు కొందరైతే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల వాసులు మరికొందరు. ఉపాధి కోసం బెజవాడ వచ్చి, కొన్నేళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఎంతో హాయిగా సాగుతున్న వీరి జీవితాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. బుడమేరు కాలువకు గండి పడి ఎగువ నుంచి ఉద్ధృతంగా వచ్చిన మున్నేరు వాగు నీరంతా వీళ్లని అష్టకష్టాల పాలు చేసింది. సింగ్‌ నగర్‌ సహా పలు ప్రాంతాల్లో నివాసముంటున్న వీరి ఇళ్లల్లోకి ఒక్కసారి వరద నీరు రావడంతో సొంతూళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. పీకల్లోతు నీళ్లల్లోనే పిల్లలను భుజాలపై ఎత్తుకుని వరదని దాటి బస్టాండ్‌కి చేరుకున్నారు. కానీ బస్సుల్లేక సొంతూరికి వెళ్లలేక బస్టాండ్‌లోనే తలదాచుకున్నారు.

ప్రయాణికులకు వరద కష్టాలు - దూరప్రాంతాలకు వెళ్లాలంటే అంతులేని నిరీక్షణ - transport Systrm Blocked in AP

భోజనం లేదు. మంచినీళ్లు లేవు. కరెంట్​ లేదు. కనీసం ఇంట్లో ఉండాలన్నా చుట్టూ వరద నీరు. దీంతో సొంత ఊరుకి అయిన వెళ్దామని ఇక్కడికి వస్తే బస్సులు లేవు- ప్రయాణికులు


భారీవర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికుల అవస్థలు - HEAVY RAINS IN AP

ఉచితంగా భోజనం పంపిణీ :వేర్వురు ప్రాంతాల నుంచి కూలి పనులకు వచ్చిన వారు సైతం వరదల్లో చిక్కుకుపోయారు. స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సుల్లేక బస్టాండ్లలోనే ఉంటున్నారు. తమ ఊరు వెళ్లేందుకు బస్సు ఎప్పుడొస్తుందని సిబ్బందిని అడుగుతూ ఎదురుచూపులు చూస్తున్నారు. సింగ్‌ నగర్‌ సహా పలు ప్రాంతాల్లోని స్థానికులు సైతం బస్టాండ్‌కి వచ్చి తలదాచుకుంటున్నారు. కట్టుబట్టలతో రావడంతో చేతిలో చిల్లిగవ్వ లేక ఆకలి, దప్పికతో అల్లాడుతున్నారు. వీరి బాధను చూసి గుండె తరక్కుపోయిన ఆర్టీసీ అధికారులు, స్థానిక హోటల్‌ యజమానులు ఉచితంగా భోజనం, నీటి బాటిళ్లు అందిస్తున్నారు. ఏదో రకంగా వాహనాలు ఏర్పాటు చేసి తమని సొంత గ్రామాలకు పంపించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

ABOUT THE AUTHOR

...view details