ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి ఖర్చులకు వెనక్కి తగ్గని కుర్రకారు - సర్వేలో ఆసక్తికర విషయాలు

పెళ్లి ఖర్చులపై వెడ్‌మిగుడ్‌ సర్వే - గతేడాది కంటే భారీగా పెరిగిన పెళ్లి ఖర్చులు - 2024లో సగటు వివాహ ఖర్చు రూ.36.5 లక్షలు

wedding_expenses
wedding_expenses (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2024, 7:15 PM IST

Spending Huge Money on Wedding Events:పెళ్లికి ఉన్నంత ప్రాధాన్యం, ప్రత్యేకత మరే కార్యక్రమానికి ఉండదు. తమ పెళ్లి గొప్పగా జరగాలని ఖర్చుకు వెనకాడకుండా అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. నచ్చిన వ్యక్తితో కలసి జీవించాలని అమ్మాయిలకు, తమ ఇళ్లను చక్కదిద్దగలరనే విశ్వాసంతో అబ్బాయిలు తమ భాగస్వామి ఎంపికలో అన్నీ ఆలోచిస్తున్నారు. అంతే కాకుండా తమకు నచ్చినట్లు పెళ్లి నిర్వహించాలని వధూవరులు కోరుకుంటున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఖర్చుకు ఆలోచించి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా చివరికి పిల్లల ఇష్టాన్ని కాదనలేక గ్రాండ్​గా పెళ్లి జరిపిస్తున్నారు. అయితే ఈ పెళ్లి ఖర్చులపై వెడ్​మిగుడ్​ అనే సంస్థ ఓ సర్వే చేసింది. గతేడాది కంటే ఇప్పుడు భారీగా పెళ్లి ఖర్చులు పెరిగాయని తెలిపింది.

3,500 జంటలతో సర్వే:2024లో వివాహ వేడుకలకు సంబంధించి వెడ్‌మిగుడ్‌ సంస్థ 3,500 నూతన జంటలతో ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అంతకుముందు 2 ఏళ్లకు సంబంధించి వెడ్డింగ్‌వైర్‌ ఇండియా వెల్లడించిన ఖర్చుల ప్రకారం 2022లో పెళ్లి ఖర్చు రూ.25 లక్షలు, 2023లో రూ.28 లక్షలు. అయితే గత రెండేళ్లతో పోలిస్తే 2024లో ఈ ఖర్చులు భారీగా పెరిగాయి. 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చిలో పెళ్లి చేసుకున్నవారు, చేసుకోబోతున్న వారు పలు వివరాలు తెలిపారు.

పెళ్లి ఫ్లెక్సీలు వేయిస్తున్నారా? - ఊహించని అతిథులతో ఇల్లు గుల్ల!

అన్నీ వారికి నచ్చినట్లే:వివాహాలకు ఎక్కువగా ఖర్చు చేయడానికి కారణాలపై పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. చిన్న వయసులోనే ఎక్కువగా సంపాదిస్తుండటం, భవిష్యత్తులోనూ ఇంకా సంపాదించగలమనే నమ్మకంతో పెళ్లి కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రుల వద్ద సరిపోయే డబ్బులు లేకపోతే పెళ్లి చేసుకునే వారే ఆ సొమ్మును ఖర్చు పెడుతున్నారు. సిటీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నాసరే పెళ్లి చేసుకునే వారే కన్వెన్షన్‌ సెంటర్​ల బుకింగ్‌ దగ్గరి నుంచి పెళ్లి మండపం అలంకరణ వరకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వివాహాలకు ధనికులు, ఎగువ మధ్యతరగతి వారు డెస్టినేషన్‌ వెడ్డింగ్స్‌ పేరుతో విదేశాలు, ఇతర నగరాలకు వెళ్తుంటే మధ్యతరగతి వారు కన్వెన్షన్‌ సెంటర్లు, రిస్టార్టుల్లో చేస్తున్నారు.

పెద్దరికం బాధ్యతలు కూడా వారే :ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ నుంచి ఎంగేజ్‌మెంట్ వరకూ ఎక్కడా ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. బ్యాచిలర్‌ పార్టీలు, మెహిందీ, సంగీత్, పెళ్లి విందు, ఫొటోగ్రఫీ, పెళ్లి మండపం, అలంకరణల కోసమే వధూవరులిద్దరూ కలిపి రూ.25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. పెళ్లిలో పెట్టే విందు కోసం ఒక్కో ప్లేటుకు దాదాపు రూ.2 వేల వరకు ఖర్చు పెడుతున్నారు. పెళ్లికి బంధుమిత్రులకు పత్రికలు పంచడం, వచ్చిన వారిని పలకరించడం వంటి బాధ్యతలను వారే కూడా చూసుకుంటున్నారు. ఇది వరకు కట్నకానుకలకు ఎక్కువ ఖర్చు చేసేవారు. ఇప్పుడు సమాజంలో మారుతున్న మార్పులతో అమ్మాయి, అబ్బాయికి తమ ఆస్తిని పంచి ఇస్తున్నారు. దీంతో వాటి గురించి కంటే వివాహ వేడుకలను ఎలా నిర్వహించాలనే చర్చే ఎక్కువగా నడుస్తోంది.

'పెళ్లి చేసుకుంటానన్నాడు - 50 లక్షల కట్నం అడుగుతున్నాడు'

'గోవాలో నా పెళ్లి' - ఆ ముచ్చట బయటపెట్టిన కీర్తిసురేశ్

ABOUT THE AUTHOR

...view details