ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గత ప్రభుత్వ నిర్లక్ష్యం - అటు వెళ్లేందుకు కూడా భయపడుతున్న జనం - Tunnel Situation in Vijayawada - TUNNEL SITUATION IN VIJAYAWADA

YCP Government Neglected Tunnel in Vijayawada : విజయవాడలోని సొరంగ మార్గం పూర్వ వైభవం కోల్పోయింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరింది. చిన్నపాటి రంధ్రాలు ఏర్పడి వర్షపు నీరు సైతం కిందకు కారుతుంది. సొరంగం గోడలన్నీ పాచి పట్టి దుర్వాసన వస్తోంది. లోపల విద్యుత్ దీపాలు సైతం సరిగ్గా వెలగకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అటువైపు ప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

YCP Government Neglected Tunnel in Vijayawada
YCP Government Neglected Tunnel in Vijayawada (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2024, 11:55 AM IST

YCP Government Neglected Tunnel in Vijayawada : విజయవాడలోని సొరంగ మార్గం పూర్వ వైభవం కోల్పోయింది. గత ఐదేళ్లు వైెఎస్సార్సీపీ నిర్లక్ష్యానికి గురై అధ్వాన స్థితికి చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొండరాళ్లు జారిపడ్డాయి. వెంటనే స్పందించిన అధికారులు తాత్కాలికంగా మెస్‌లను ఏర్పాటు చేశారు. అయినా పైనుంచి నీరు కారుతోంది. పైగా దుర్వాసన వస్తోంది. ఫలితంగా దీనిలో ప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.

అధ్వానంగా మారిన సొరంగ మార్గం :విజయవాడ చిట్టినగర్ నుంచి భవానీపురం వెళ్లే మార్గంలో ఉండే సొరంగం అధ్వానంగా మారింది. సొరంగ మార్గాన్ని అందంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో 2018లో తెలుగుదేశం హయాంలో నగర పాలక సంస్థ సుందరీకరణ పనులు చేపట్టింది. అందంగా వివిధ ఆకృతులతో బొమ్మలు గీయించి తీర్చిదిద్దింది. దీని కోసం లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేసింది. అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీని నిర్వాహణ గాలికొదిలేసింది. దీంతో రంగులు మాసిపోయాయి. సొరంగ మార్గంలో ఉండే విద్యుత్ దీపాలు సైతం సరిగ్గా వెలగడం లేదు. దీంతోపాటు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడి వర్షపు నీరు సైతం కిందకు కారుతుంది. సొరంగం గోడలన్నీ పాచి పట్టి దుర్వాసన వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడ సమీపంలో పొంగిన పెద్దవాగు - చిక్కుకున్న 150 మంది విద్యార్థులు, రైతులు - PEDDAVAGU OVERFLOWED

"2018లో చంద్రబాబు హయాంలో ఈ సొరంగా అందంగా ఉండేది. తరువాత జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సొరంగాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చాలా మందికి ఫిర్యాదులు చేసి అలసిపోయాం. అప్పట్లో లైట్ల వెలుతురులో అందంగా ఉండేది. ఇప్పుడు లైట్లు లేకపోవడంతో చీకటిగా ఉంటుంది. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాగే పైనుంచి నీరు కూడా కారుతోంది. ఇటువైపు రావాలంటేనే భయం వేస్తొంది. ప్రస్తుతం ఏర్పాడిన కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం." - స్థానికులు

పూర్వవైభవం వస్తుందని ఆశలు :ఈ సొరంగ మార్గంలో పాదచారులు నడిచే బాటను పదులు సంఖ్యలో యాచకులు అవాసంగా మార్చుకున్నారు. రాత్రిపూట వీరి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాదచారులకు ఇబ్బందిగా మారింది. దీనిపై అధికారులు పర్యవేక్షణ కరువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఈ చిట్టినగర్ సొరంగ మార్గానికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు.

భవానీ ద్వీపానికి వరద దెబ్బ - కళావిహీనంగా మారిన పరిసరాలు - Bhavani Island Damaged in Floods

చిన్నారికి అనారోగ్యం - అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన సీఎం చంద్రబాబు - CM Chandrababu Help To Child

ABOUT THE AUTHOR

...view details