ఏప్రిల్ నుంచే రూ. 4 వేల పింఛన్ పెంపు - దృష్టి పెట్టిన అధికారులు (ETV Bharat) Pension Distribution Of AP : పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జులై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు.
Officials Working on Increasing Pensions : నాలుగు వేల పింఛను పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దీంతో అధికారులు వీటి లెక్కలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 65.30 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పింఛను నగదు చెల్లింపులకుగాను నెలకు రూ. 1939 కోట్ల ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే రూ. 4 వేల పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7 వేల రూపాయలు చొప్పున, దివ్యాంగులకు రూ. 6 వేల పింఛన్‌ను కలిపి జులై 1న పంపిణీ చేయడానికి 4,400 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు రూ. 2800 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు లెక్కగట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు.
పింఛన్ల సొమ్ము విడుదల చేసిన ప్రభుత్వం - పంపిణీపై మార్గదర్శకాలు విడుదల - government released pension funds
దివ్యాంగ పింఛనుదారులు రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరి పింఛనును 6000 రూపాయలకు పెంచుతామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇవి కాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15,000 రూపాయల పింఛన్ కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్యశాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు సేకరిస్తున్నారు.
ఈసీ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోండి- ఎన్‌హెచ్‌ఆర్సీకి కనకమేడల ఫిర్యాదు - TDP Letter To NHRC
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛన్‌ను అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు అనే విషయంపై అధికారులు దృష్టి పెట్టారు. వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను అధికారులు సమీకరిస్తున్నారు.
రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం - పింఛన్ కోసం విలవిల్లాడుతున్న వృద్ధులు - Pensioners Died in Andhra Pradesh