ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి మా భూములు విడిపించండి' - ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన బాధితులు - PEDDI REDDY VICTIMS IN NTR BHAVAN

తమ భూములు కబ్జా చేశారు - పెద్దిరెడ్డి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కంభంపాటి రామ్మోహన్‌రావు, బుచ్చి రాంప్రసాద్

Peddi Reddy Victims in NTR Bhavan
Peddi Reddy Victims in NTR Bhavan (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 10, 2025, 5:19 PM IST

YSRCP Leader Peddi Reddy Victims in NTR Bhavan : తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​కు పెద్దిరెడ్డి బాధితులు పోటెత్తారు. పెద్దిరెడ్డి అనుచరులు తమ భూములు కబ్జా చేశారంటూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సమయంలో 14మందిని కిడ్నాప్ చేశారని, నాడు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదంటూ వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా, స్థానిక అధికారులు పెద్దిరెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

పెద్దిరెడ్డి కబంధ హస్తాల నుంచి తమ భూములు విడిపించి న్యాయం చేయాలని వేడుకున్నారు. బాధితుల నుంచి టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, బుచ్చి రాం ప్రసాద్ ఫిర్యాదులు స్వీకరించారు.

ABOUT THE AUTHOR

...view details