PCC Chief Sharmila Sensational Comments On Ys Jagan : అదానీ ముడుపుల వ్యవహారంలో జగన్‌పై ఇంకా చర్యలు ఎందుకు తీసుకోలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి గత ప్రభుత్వం చేసుకున్న సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. FBI ఛార్జ్‌షీట్‌లో తన పేరు లేదని జగన్ చెప్పడం ఆయన వెర్రితనమన్నారు. ఈ వెర్రివాడా ఐదేళ్లూ మనల్ని పాలించిందని ప్రజలు అనుకోగలగరంటూ షర్మిల ఎద్దేవా చేశారు. జగన్, అదానీ సెకీ ఒప్పందంపై షర్మిలా మాట్లాడుతూ "అదానీతో మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలి. డీల్ రద్దు చేయడానికి బాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? అదానీ వద్ద జగన్ రూ.1750 కోట్ల ముడుపుల వ్యవహారంపై రేపు ఏసీబీకి ఫిర్యాదు చేస్తామని షర్మిలా తెలిపారు.
ఈ అంశం అమెరికా కోర్టుల్లో కేసు నమోదు అయింది. ఇంత జరిగినా కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు లేవు. చంద్రబాబు అదానీ పేరు కూడా ఎత్తడం లేదు. జగన్ కి చంద్రబాబుకి ఏమిటి తేడా ? జగన్ రాష్ట్రాన్ని సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టాడు. నా పేరు లేదు అని జగన్ అతి తెలివిగా మాట్లాడాడు. నా పేరు ఎవరైనా చెప్పారా అంటున్నాడు. అప్పుడు చీఫ్ మినిస్టర్ అంటే జగన్ కాదా ? మీది అతి తెలివినా? వెర్రితనమా? మీకు వెర్రి పట్టింది అని జనాలు అనుకుంటున్నారని షర్మిలా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రేషన్ మాఫియా జాతీయస్థాయి కుంభకోణం - హడావుడి కాదు, నిగ్గు తేల్చాలి : షర్మిల
ఇలాంటి వెర్రివాడా ఐదేళ్లు పాలించింది అని అనుకునే ప్రమాదం ఉంది. రాష్ట్రానికి 25 ఏళ్లు అదానీ పవర్ ఒక భారం. పక్క రాష్ట్రాల్లో రూ. 1.99 పైసలు అమ్ముతుంటే ఇక్కడ రూ.2.49 పైసలు ఎక్కువ పెట్టీ ఎందుకు కొన్నారు? రాష్ట్రంపై ప్రతి యూనిట్ కి 50 పైసలు అదనం. ఈ 50 పైసలు భారం ప్రజల మీద పడితే చంద్రబాబుకి ఓకేనా ? ట్రాన్స్మిషన్ చార్జీలు లేవు అని జగన్ అంటున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు యూనిట్‌కి 1.70 పైసలు దాకా పడే అవకాశం అంటున్నారు. దీనిపై చంద్రబాబు ఎటువంటి విచారణ చేస్తున్నారు? ట్రాన్స్మిషన్ చార్జీలు ఉన్నాయా ? లేదా ? చెప్పాల్సిన భాధ్యత చంద్రబాబు పై ఉందని షర్మిల అన్నారు.
ప్రతి ఏడాది సోలార్ పవర్ చార్జీలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు 10 రూపాయలు ఉండే యూనిట్ ధర ఇప్పుడు 1.99 పైసలు వచ్చింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. చార్జీలు తగ్గుతూంటే జగన్ 25 ఏళ్లకు ఎందుకు MOU చేశారు. జగన్ అధికారంలో వచ్చాకా చంద్రబాబు చేసిన ఒప్పందాలు రద్దు చేశారు. లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉండకూడదు అన్నారు. మరీ జగన్ ఎందుకు 25 ఏళ్లకు అదానీ తో ఒప్పందం చేసుకున్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీ డీల్ పెద్ద కుంభకోణం అని ఆందోళన చేసింది. కోర్టులో కూడా కేసులు వేసింది. పెద్ద ఎత్తున ముడుపులు అందాయని పయ్యావుల కేశవ్ ఆరోపణలు చేశాడని గుర్తు చేశారు.
జగన్‌ను ఆస్కార్‌కు నామినేట్ చేసిన షర్మిల - బైబిల్‌పై ప్రమాణం చేయాలని సవాల్