ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తుల మనోభావాలపై దాడి జరిగింది - ప్రశ్నించకుండా ఎలా ఉండగలం? - జగన్​పై పవన్​ తీవ్ర ఆగ్రహం - Pawan kalyan Deeksha

Pawan kalyan Begins 11 Days Deeksha : తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని చెప్పారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారని పవన్ కల్యాణ్ నిలదీశారు.

Pawan kalyan 11 Days Deeksha
Pawan kalyan 11 Days Deeksha (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2024, 11:12 AM IST

Updated : Sep 22, 2024, 7:48 PM IST

Pawan kalyan Prayaschitta Deeksha : ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పండితుల ఆశీర్వచనం పొందారు. 11 రోజులపాటు దీనిని కొనసాగించనున్నారు. దీక్ష పూర్తయ్యాక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పవన్ కల్యాణ్ దర్శించుకోనున్నారు.

Tirupati Laddu Issue Updates :తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్సార్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజా విధానాలను మార్చేశారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

"శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.10,000లు వసూలు చేశారు. కానీ బిల్లు మాత్రం రూ.500కే ఇచ్చారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయాలు ధ్వంసమయ్యాయి. రథాలు తగలబెట్టారు ఆలయాలను అపవిత్రం చేశారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే ఆనాడు పోరాడాం. ఏ మతమైనా కావచ్చు మనోభావాలు దెబ్బతినకూడదు." - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి

వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారు? : తిరుమల శ్రీవారి లడ్డూను మహా ప్రసాదంగా భావిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందని చెప్పారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతోందని ఊహించలేదని పేర్కొన్నారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. అపవిత్రం జరుగుతోంటే సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి ఏం చేశారని నిలదీశారు. తప్పులు చేసిన వారిని జగన్‌ ఎలా సమర్థిస్తారు? అని విమర్శించారు. కోట్లమంది హిందువులు స్వీకరించే ప్రసాదాన్ని అపవిత్రం చేస్తారా? అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

'వేదన కలిగినప్పుడు పోరాడతాం. ఏ మతంపై దాడి జరిగినా ఇలాగే స్పందిస్తాం. పరస్పర విశ్వాసాలను గౌరవించుకోవాలి. దోషులకు కఠిన శిక్ష పడాల్సిందే. కేబినెట్‌ భేటీలో, అసెంబ్లీలో చర్చ జరగాలి. నెయ్యి ఎందుకు తక్కువ ధరకు వస్తుందోనని ఆలోచించరా. కల్తీ నెయ్యి విషయం తెలిసీ కొంతమంది భయపడి చెప్పలేదా. టీటీడీలో ఇంతమంది ఉద్యోగులు ఉంటే ఎవరికీ తెలియదా' అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్​ను కలిశారు. మంగళగిరి క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కు శ్రీవారి లడ్డూ ప్రసాదం అందజేశారు. గత పాలకమండలి హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన అంశంపై ఆయనకు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం లడ్డూ తయారీకి కర్ణాటకకు చెందిన స్వచ్ఛమైన నెయ్యి వినియోగిస్తున్నట్లు చెప్పారు.

'తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి'పై పవన్ సీరియస్- ఇంకా ఏమన్నారంటే? - Pawan About Tirumala Laddu Issue

చంద్రబాబు ఓపిక ఆశ్చర్యపరుస్తోంది - సీఎం నాయకత్వంలో పని చేయడం సంతోషం : పవన్​ కల్యాణ్​ - PAWAN KALYAN ABOUT CM CHANDRA BABU

Last Updated : Sep 22, 2024, 7:48 PM IST

ABOUT THE AUTHOR

...view details