ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీసీబీ దస్త్రాల దహనంపై పవన్ కల్యాణ్​ ఆరా - కీలక ఆదేశాలు - pawan kalyan on pcb documents issue

Pawan Kalyan on PCB Documents Issue: పీసీబీ దస్త్రాల దహనంపై ఉప ముఖ్యమంత్రి పవన్ ఆరా తీశారు. దహనం చేసిన దస్త్రాల వివరాలు తక్షణమే అందించాలని ఆదేశించారు. బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకెళ్లాలని పవన్ ఆదేశాలు ఇచ్చారు. పీసీబీ కార్యాలయాల్లో దస్త్రాల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేంటో చెప్పాలని ఆధికారులను కోరారు.

Pawan Kalyan on PCB Documents Issue
Pawan Kalyan on PCB Documents Issue (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 3:15 PM IST

Pawan Kalyan on PCB Documents Issue: కాలుష్య నియంత్రణ మండలి ఫైల్స్, రిపోర్టుల దగ్ధంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. పీసీబీకి సంబంధించిన ఫైల్స్, రిపోర్టులను కృష్ణా నది కరకట్టపై దగ్ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్ధం చేసిన ఫైల్స్, రిపోర్టులకు సంబంధించిన వివరాలను తక్షణమే అందించాలని ఆదేశించారు. ఈ దగ్ధం వెనక ఎవరెవరు ఉన్నారో విచారణ చేయాలని సూచించారు. ఇందుకు బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలకు ముందుకు వెళ్లాలని ఆదేశాలిచ్చారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్, రిపోర్టులు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి, భద్రపరచేందుకు అనుసరిస్తున్న విధానాలు ఏమిటో వెల్లడించాలని ఆధికారులకు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details