Pawan Kalyan Delhi Tour : దిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. అంతకుముందు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ను ఆయన కలిశారు. నోడల్ ఏజెన్సీ పెట్టేందుకు గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదని పవన్ చెప్పారు. పక్క రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనంపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పట్టుబడిన ఎర్రచందనం విక్రయంలో వాటాపైనా నిర్ణయం తీసుకోవాలని వచ్చిన మొత్తాన్ని 60:40 నిష్పత్తి ప్రకారం వాటా వచ్చేలా మాట్లాడతామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే అదానీ అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో చాలా అవకతవకలు జరిగాయని తెలిపారు. అన్ని అంశాలు పూర్తిగా పరిశీలించాకే నిర్ణయం ఉంటుందన్నారు. మనదైన అధ్యయనం, విచారణ తర్వాత అదానీ అంశంపై నిర్ణయమని పవన్ చెప్పారు. అంతకుముందు పవన్‌తో సమావేశమైన బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులురెడ్డి సమావేశమయ్యారు.