Pawan Kalyan Call to Celebrate Vinayaka Chavithi in Environment Free Manner:డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) చేపట్టిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలపై వరుసగా సమీక్షలు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాలు, అభివృద్ధి, అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు నిర్మాణాత్మక సూచనలు అందిస్తూ దానికి తగినట్లుగా ఆదేశాలు ఇస్తున్నారు.
ఈ క్రమంలో స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి పలు సూచనలు, అభిప్రాయాలూ పవన్‌కి అందుతున్నాయి. తమ అభిప్రాయాలను తెలియచేస్తూ నివేదికలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళగిరిలో పవన్ కల్యాణ్ నివాసంలో కొంత మంది ప్రకృతి ప్రేమికులు ఆయనను కలిసారు. ఈ క్రమంలో పర్యావరణానికి హాని చేయని విధంగా వస్తువుల వాడకం పెంచి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు తగిన సూచనలు చేశారు.
పర్యావరణహితంగా జరుపుకోవాలని పవన్ పిలుపు:పర్యావరణ హితంగా వినాయక చవితి చేసుకోవాలని ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలన్నారు. మన వేడుకలు ఉత్సవాల్లో పర్యావరణహిత వస్తువులను వాడడం మేలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.