BRS MLA Mahipal Reddy will join the Congress : బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. దీంతో త్వరలో ఎమ్మెల్యే మహిపాల్ పాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మహిపాల్ రెడ్డి 2014 నుంచి మూడుసార్లు వరుసగా బీఆర్ఎస్ తరఫున గెలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాలె యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. మరికొందరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి పలువురు త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి సీఎంను కలవడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ముందుగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలు తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. అనంతరం ఆయనను సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ దించారు. అయితే ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కిషన్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు కూడా దక్కలేదు. దీంతో అక్కడ తన బలాన్ని పెంచుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తోంది.
దానం తరువాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఎన్నికల ఫలితాలు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్లమెంటు ఎన్నికల ముందు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం పార్టీలో చేరి తన కుమార్తె కడియం కావ్యకు వరంగల్ టికెట్‌ను దక్కించుకున్నారు. అనంతరం ఆమె అక్కడ ఎంపీగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిపించారు. ఆతర్వాత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
29కి పడిపోయిన బీఆర్ఎస్ బలం :చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య దిల్లీ వెళ్లి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆతర్వాత గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఇవాళ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటివరకు తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుకుని బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చారు. వీరందరిని కలుపుకొని కాంగ్రెస్ బలం 74కి పెరిగింది. సీపీఐతో కలిపి 75కు చేరుకుంది. బీఆర్ఎస్ బలం 29కి పడిపోయింది. అసెంబ్లీలో బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులు ఉన్నారు.
కేసీఆర్‌కు భారీ షాక్ - కాంగ్రెస్ గూటికి ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు - 6 BRS MLCs JOINED CONGRESS
బీఆర్ఎస్కు మరో షాక్ - కాంగ్రెస్‌లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య - BRS MLA Kale Yadaiah join Congress