ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓట్లు- ప్రయాణ పాట్లు! ప్రజాసామ్య స్పూర్తికి తూట్లు- బస్సుల లేమిపై తీవ్ర ఆగ్రహావేశాలు - Passengers Suffering in AP - PASSENGERS SUFFERING IN AP

Passengers Suffering Due to Lack of Buses in AP: ఓట్ల పండుగకు వస్తున్న జనం బస్సుల్లేక నానా పాట్లు పడుతున్నారు. ఓటేసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి ఓటర్లు పెద్దఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆర్టీసీ అరకొర బస్సులు మాత్రమే ఏర్పాటు చేసింది. ప్రైవేటు వాహనాల్లో వెళ్దామంటే ఛార్జీల మోత భరించలేక పోతున్నారు. దీంతో బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

passengers_suffering_in_ap
passengers_suffering_in_ap (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 9:29 PM IST

Passengers Suffering Due to Lack of Buses in AP:ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లిన వారంతా ఓటేసేందుకు పెద్దఎత్తున పల్లెబాట పట్టారు. అతికష్టం మీద తెలంగాణ ఆర్టీసీ ఏర్పాటు చేసిన బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వచ్చారు. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరుకు బస్సుల కొరత ఏర్పడింది. ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు బస్సులు సరిపడా లేవు. రెగ్యులర్ సర్వీసులు ఏ మాత్రం సరిపోవడం లేదు. దీంతో ప్రయాణికులు గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. బస్సుల సమాచారం అడిగినా ఆర్టీసీ యాజమాన్యం సరిగా స్పందించట్లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఈసీ చర్యలు - మరికొందరిపైనా కొరడా - CEO ACTION AGAINST NANDYALA SP

ఇప్పటికే సరిపడా బస్సుల్లేక ప్రయాణీకులు ఇబ్బందులు పడుతుంటే విజయవాడ నుంచి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర సహా పలు ప్రాంతాలకు వెళ్లే సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసింది. సుమారు 48 సర్వీసులు రద్దు చేసినట్లు పీఎన్​బీఎస్​ లోని సమాచార కేంద్రం వద్ద నోటీసులు అంటించారు. రద్దుకు గల కారణాలను మాత్రం అధికారులు తెలపలేదు. అదనపు బస్సులు ఏర్పాటు చేయాల్సింది పోయి ఉన్నవాటిని రద్దు చేయడమేంటని ప్రయాణీకులు అధికారులను నిలదీశారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో గుంటూరు బస్టాండ్‌ కిక్కిరిసిపోయింది. గుంటూరు నుంచి పల్నాడు, బాపట్ల జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం మహిళలు, వృద్ధులు, పిల్లలు బస్టాండ్‌లో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. వందల మంది వచ్చి నానా అవస్థలు పడుతున్నప్పటికీ అనేక బస్సులను రెస్ట్ పాయింట్లో ఉంచడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. పసిపిల్లలతో తాము అవస్థలు పడుతున్నా అధికారులు ఖాళీగా ఉన్న బస్సులను నడపకపోవడంపై ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

74శాతం పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు-​ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే సమాచారం ఉంది!: ముఖేశ్ కుమార్ మీనా - Mukesh Kumar Meena

ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సైతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. ఒంగోలు నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు బస్సుల్లేక గంటల తరబడి పడిగాపులు కాశారు. బస్సులు ఎప్పుడు వస్తాయని అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లతో అనంతపురం ఆర్టీసీ బస్టాండ్‌లో రద్దీ నెలకొంది. పల్లెవెలుగు బస్సులను అధికారులు పూర్తిగా రద్దు చేయడంతో ప్రయాణీకులు సొంతూళ్లకు వెళ్లేందుకు నానా అవస్థలు పడ్డారు. సత్యసాయి జిల్లా కదిరి బస్టాండ్‌ సైతం ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. బస్సుల్లేక గంటల తరబడి బస్టాండ్లలోనే పడిగాపులు కాస్తూ నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్నికల సమయంలోనూ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై మండిపడుతున్నారు. వచ్చిన ఒకటీఅరా బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణీకులు ఎగబడ్డారు.

జగన్​కు దారుణ పరాభవం - ఆ మంత్రి గెలిచినా టీడీపీలోకి వెళ్తాడు - పీకే మరో సంచలన ఇంటర్వ్యూ - Prashant kishor on ap elections

ప్రజాసామ్య స్పూర్తికి తూట్లు- బస్సుల లేమిపై తీవ్ర ఆగ్రహావేశాలు (Etv Bharat)

ABOUT THE AUTHOR

...view details